Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

నా పుట్టుకలో తప్పు జరిగింది అంటోంది కాజల్-I Was Born In A Wrong Family – Kajal Agarwal

కాజల్ అగర్వాల్‌ .. ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ళ గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. కెరీర్ మొదలుపెట్టి దశాబ్ద కాలం అవుతున్నా, ఈ గ్యాప్ లో ఎంతోమంది కొత్త హీరోయన్లు స్టార్ గా ఎదిగినా, కాజల్ స్థానం కాజల్ దే. ఇంకా దక్షిణాదిన పెద్ద ఆఫర్లతో దూసుకుపోతోంది. ఓ దక్షిణాది అమ్మాయిలగే కలిసిపోయింది. కాని కాజల్ సౌత్ అమ్మాయి కాదు. తను పుట్టింది మహారాష్ట్రలో. నాటకాలతో కెరీర్ మొదలుపెట్టి దర్శకుడు తేజ కంట్లో పడి లక్ష్మీ కళ్యాణంలో ఛాన్స్ కొట్టేసి, చందమామతో సక్సెస్ రుచి చూసి, మగధీరతో స్టార్ గా ఎదిగింది. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే చలామణి అవుతోంది.

తెలుగు – తమిళ ప్రేక్షకులు ఇంతగా ఆదరించారు కాబట్టే కాబోలు, తాను దక్షిణాది అమ్మాయినే అని, తన పుట్టకలో తప్పు జరిగిందని, ఇక్కడ పుట్టాల్సింది అక్కడ పుట్టేసానని అంటోంది ఈ ముద్దుగుమ్మ. ” నా పుట్టుక నా చేతిలో లేదు కాబట్టి తప్పు జరిగింది. నేను పొరపాటులో ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలిలో పుట్టేసాను. ఈ విషయాన్ని నా కుటుంబసభ్యులకి చాలాసార్లు చెప్పాను. నేను పక్కా దక్షిణాది అమ్మాయిని. ఈ విషయం గర్వంగా చెబుతా. నాకు బాలివుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయి. కాని నాకు తెలుగు – తమిళ సినిమాలు చేయడమే ఇష్టం. నా కెరీర్ ఇక్కడే మొదలుపెట్టాను. బాలివుడ్ కోసమని ఇక్కడి సినిమాలి వదులుకోను” అంటూ చెప్పుకొచ్చింది ఈ సుందరి.

ఇదంతా దక్షిణాది మీద ప్రేమేనా లేక ఎలాగో బాలివుడ్ లో ఫేయిల్ అవడం వలన ఇలా కవర్ చేస్తోందా? ఏదోకటి, మనకు కావాల్సింది కాజల్ ని తెర మీద చూడ్డమే. కాజల్ తదుపరి సినిమాల విషయానికి వస్తే రానాతో “నేను రాజు నేనే మంత్రి”, విజయ్ తో ఓ సినిమా, అజిత్ సరసన “వివేగం” చిత్రాలతో బిజీగా ఉంది.

Continue Reading
To Top