Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

పవన్ కళ్యాణ్ లాంటి భర్త కావాలంట ఈ హీరోయిన్ కి-I Want A Husband Like Pawan Kalyan .. Says Young Actress

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … ఈ పేరంటేనే యూత్ లో పిచ్చక్రేజు. అబ్బాయిల్లోనే కాదు, అమ్మాయిల్లోనూ పవన్ అంటే అదోరకం ఫాలోయింగ్ ఉంది. మన పవర్ స్టార్ కి సెలబ్రటీల్లో కూడా ఫ్యాన్స్ ఎక్కువే. దర్శకులు, హీరోలు, కామెడియన్లు, హీరోయిన్లు .. ఈ డిపార్టుమెంట్స్ లో పవర్ స్టార్ ని అభిమానించేవారు ఉన్నారు. అంతమంది ఫ్యాన్స్ లో ఒకరిగా తాను కూడా ఉన్నానని అంటోంది నటి పూనమ్ కౌర్.

ఇండస్ట్రీకి తేజ పరిచయం చేసిన హీరోయిన్లలో ఒకరైన పూనమ్, కెరీర్ మొదట్లో ఒకటిరెండు మంచి అవకాశాలు దక్కించుకున్నా, అందంగా ఉన్నా, హీరోయిన్ లో ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా, ఎందుకో పెద్దగా ఎదగలేకపోయింది. బాలివుడ్ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేని పూనమ్ త్వరలోనే పెళ్ళి చేసుకోవాలనుకుంటుందేమో, తనకి మంచి భర్త కావాలని, పవన్ కళ్యాణ్ లా ఉండాలని అంటోంది.

పవన్ కి ఇంతమంది అభిమానులు ఎలా పుట్టుకొచ్చారు అంటే అది ఆయన వ్యక్తిత్వం వలనే. నిజాయితీగా, ముక్కుసూటిగా, సింపుల్ గా ఉంటాడని పవన్ గురించి అంతా చెబుతుంటారు. పవన్ లోని ఈ గుణమే తనకు ఇష్టమని, పవన్ లాగా నిజాయితీగా ఉండే భర్త కావాలని, తన భర్త పవన్ కళ్యాణ్ లా ఉండాలని కోరుకుంటోంది పూనమ్.

కోరిక బాగానే ఉంది కాని పవన్ లాంటివాడే కావాలని కూర్చుంటే పెళ్ళి చాలా ఆలస్యంగా జరుగుతుందేమో. ఎందుకంటే పవర్ స్టార్ లాంటోడిని దొరకబట్టాలంటే ఒక్కరోజులో పూర్తయ్యే పని కాదుగా.

Continue Reading
More Posts
To Top