Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

జనాలు తనని చెప్పుతో కొడతారేమో అనుకుందట ఇలియానా -“I Though People Would Hit Me With Chappals” – Ileana Reveals

తొలిసినిమా దేవదాసుతోనే కుర్రాళ్ళ మనసులో గిలిగింతలు పెట్టింది ఇలియానా. ఆ సినిమా ఇలా హిట్ అవగానే అలా మహేష్ బాబుతో పనిచేసే అవకాశం దక్కించుకుంది. ఇక పోకిరి గురించి, ఆ సినిమా సృష్టించిన సంచలనాల గురించి, ఆ సినిమా వలన పెరిగిన ఇలియానా రేంజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. కాని అంత పెద్ద స్టార్ అయిపోతానని ఇలియానా ఊహించలేదట. పోకిరి అవకాశం రాకపోయుంటే సినిమా ఇండస్ట్రీని పూర్తిగా వదిలెద్దామానుకున్న ఇల్లి బేబి, అసలు దేవదాసు సినిమాతో ని కూడా కష్టంగానే చేసింది తప్ప ఇష్టంగా చేయలేదు.

ఇలియానా మోడలింగ్ చేస్తున్న రోజుల్లో దేవదాసు అవకాశం వచ్చింది. సినిమా చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న ఇలియానా, అమెరికాలో 45 రోజులు షూట్ అని తెలియగానే ఒప్పేసుకుందట. ఫ్రీగా అమెరికా చూడొచ్చు అనే ఒక ఒక కారణంతో ఈ సినిమా ఒప్పుకుందట గోవా బ్యూటి. ఆ టైంలో తనకి తెలుగు రాదు, కనీసం హిందీ కూడా రాదు. మొత్తం ఇంగ్లిష్ లోనే మేనేజ్ చేసేదట సెట్స్ లో. అసలు ప్రేక్షకులు తనను మెచ్చరని, తానూ బాగా లేనని బాధపడేదట ఇలియానా. సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రెస్ మీట్స్ కి రావడానికి కూడా ఇలియానాకు ధైర్యం ఉండేది కాదట. థియేటర్లో ప్రేక్షకులని కలవడానికి వెళితే ప్రేక్షకులు తనని చెప్పులతో కొడతారేమో అని భయపడేదట. కాని థియేటర్ కి వెళ్ళాకా చూస్తే, జనాలు ఆమెకి ఘన స్వాగతం పలికారు. కొన్నిరోజుల్లోనే ఇలియానా తెలుగు యువత కలలరాణిగా మారింది. కొందరు అంతే .. తమ సక్సెస్ ని తామే నమ్మలేకపోతారు.

అంతా ఒకే కాని, ఇలియానా లాంటి అందగత్తె కూడా తన మీద తాను నమ్మకం పెట్టుకోకపోగా, జనాలు తనని చెప్పులతో కొడతారేమో అని భయపడటం వినడానికి విచిత్రంగా ఉంది కదూ. ప్రస్తుతం హిందీలోనే సినిమాలు చేస్తున్న ఈ 30 ఏళ్ల సుందరి, ఇటు అజయ్ దేవగన్ తో బాద్శాహో, అటు అర్జున్ కపూర్ తో ముబరకాన్ అనే సినిమాలు చేస్తోంది.

Continue Reading
More Posts
To Top