బొమ్మ 'పడి'పోయినా..కాసుల వర్షం కురిసింది...

కొన్ని చిత్రాలు…ముందు రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటాయి.వాటికీ గల కారణాలు అనేకం అయినప్పటికీ…పోను.పోను…హిట్ గా మారే అవకాశాలు చాలానే ఉంటాయి.అలాంటి చిత్రాల కోవలోకే వస్తుంది తాజాగా శంకర్ తెరకెక్కించిన విజువల్ వండర్ “ఐ”.

 I Collection Records At Box Office-TeluguStop.com

విషయం ఏమిటంటే…శంకర్ విజువల్ వండర్ ‘ఐ’ విడుదలైన అన్ని చోట్లా అదరగొట్టే ఓపెనింగ్స్ సాధించింది.ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ ఐ మూవీ కలెక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఎందుకంటే ఐ మూవీ సబ్జెక్ట్ చాలా వీక్ గా ఉన్నప్పటికీ, కలెక్షన్స్ మాత్రం, బాక్సాపీస్ వద్ద దూసుకుపోతూనే ఉంది.విషయంలోకి వెళితే ఇప్పటి వరకూ ఐ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టిందనే రిపోర్ట్ వినిపిస్తున్నాయి.

ఐ మూవీ మదటి రెండు వారాలకే 137 కోట్ల రూపాయలను కొట్ల కొట్టింది.ప్రపంచ వ్యాప్తంగా ఐ మూవీకి భారీ ఓపెనింగ్స్ రావడమే ఇందుకు ప్రధాన కారణం అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఐ మూవీకి కోలవుడ్ లో ఇంకా కలెక్షన్స్ వరద తగ్గలేదు.కోలీవుడ్ బాక్సాపీస్ వద్ద ఐ సత్తా చాటుతూనే ఉంది.మూడవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా, దాదాపు 150 కోట్ల రూపాయల మార్క్ ని టచ్ చేసిందని అంటున్నారు.ఒక్క తమిళనాడులో ఈ మూవీ దాదాపు 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని టచ్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ 31 కోట్ల రూపాలయను కలెక్ట్ చేసింది.అలాగే హిందిలో 10 కోట్ల రూపాయలు, ఇలా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలుపుకుంటే దాదాపు 150 కోట్ల రూపాయలను టచ్ చేసినట్టుగా కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

ఏది ఏమైనా విక్రమ్ పడ్డ కష్టానికి కనీసం ఇలా అయినా ఫలితం లభించింది అనే చెప్పుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube