జగన్ అంటే చాలా ఇష్టం : జగపతిబాబు-I Like Jagan Says Jagapathi Babu 3 months

Ism ISM Promotions Trailer Jagapathi Babu Puri Jagannath Photo,Image,Pics-

డైరక్టర్ పూరి జగన్నాథ్ ను సినిమావాళ్లందరు జగన్ అని పిలుస్తారు. సాధారణంగా జగన్ అనగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు కాని ఇక్కడ జెబి ప్రస్తావించిన జగన్ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నమాట. దర్శకుడిగా డేరింగ్ డ్యాషింగ్ సినిమాలను తీసే పూరి మొదటిసారి కళ్యాణ్ రాం తో ఇజం అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ లో జగపతి బాబుని సెలెక్ట్ చేశారు. ఇక టీజర్ ట్రైలర్స్ లో జెబి లుక్స్ అదుర్స్. సినిమాలో విలన్ గా కనిపించబోతున్న జగపతి బాబు త్వరలో రిలీజ్ అవబోతున్న ఇజం గురించి ప్రమోషన్స్ లో భాగంగా పూరిపై తనకున్న అభిమానం చాటుకున్నాడు.

పూరి టెక్నిషియన్ కన్నా వ్యక్తిగా కూడా చాలా ఇష్టమని అన్నారు జెబి. ఎంతగా అభిమానిస్తాను అంటే తన సినిమా ఆఫర్ వస్తే కథ వినకుండానే ఓకే చేసేంత అంటున్నారు జగ్గు భాయ్. కెరియర్ హీరోగా ఎండ్ కార్డ్ వేసేసి విలన్ గా కొత్త అవతారం ఎత్తిన జెబి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొత్త క్రేజ్ సంపాదించారు. అందుకే ప్రతి హీరో ఇప్పుడు జగపతి బాబు కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగులోనే కాదు తమిళ మలయాళ భాషల్లో కూడా జగపతి బాబు తన సత్తా చాటుతున్నాడు. పూరితో తనకున్న అనుబంధం ఇప్పటిది కాదు బద్రి తర్వాత జగపతి బాబుతో బాచి సినిమా తీశాడు పూరి అప్పటినుండి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే జగపతి బాబు జగన్ గురించి అంత గొప్పగా స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. శృతి హాసన్ - సమంతల మధ్య "ప్రేమ" గొడవలు ?

About This Post..జగన్ అంటే చాలా ఇష్టం : జగపతిబాబు

This Post provides detail information about జగన్ అంటే చాలా ఇష్టం : జగపతిబాబు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

I Like Jagan Says Jagapathi Babu , Jagapathi Babu, Puri Jagannath, ISM, ISM Trailer, ISM Promotions

Tagged with:I Like Jagan Says Jagapathi Babu , Jagapathi Babu, Puri Jagannath, ISM, ISM Trailer, ISM PromotionsI Like Jagan Says Jagapathi Babu,ism,ISM Promotions,ISM Trailer,jagapathi babu,puri jagannath,,