నాది తెల్లతోలు కాదు అంటున్న ఇలియానా

గోవా బ్యూటి ఇలియానా ఏం మాట్లాడినా అదో వెరైటీ.బ్యూటి ప్రాడక్ట్ పాండ్స్, ఫేయిర్ అండ్ లవ్లీ యాడ్స్ లో కనిపించే ఇలియానా, తనది తెల్ల తోలు కాదు అని అంటోంది.

 I Have A Tanned Skin, Not Fair – Ileana-TeluguStop.com

నేను కొద్దిగా నలుపు క్యాటగిరి అని చెబుతోంది.ఇటివలే పాండ్స్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లి బేబి, అక్కడే ఈ వ్యాఖ్యలు చేసింది.

“నేను తెల్లగా ఉన్నానని అనుకోను.నేను ట్యాన్డ్ క్యాటగిరిలోకి వస్తాను.

నాకు తెలిసి మనకు తెలుపుపై అంత ఆసక్తి ఉండదు.చాలామంది నటీమణులు, మోడల్స్ చామనచాయ, నలుపు రంగులో అందంగా కనబడతారు.

చర్మం యొక్క రంగు ముఖ్యం కాదని నేను నమ్ముతాను.నాకు తెలిసి ఆరోగ్యంగా ఉండటం, సంతోషంగా ఉండటమే అందం.

నేను ఆ విషయాన్నే ప్రమోట్ చేస్తున్నాను” అని చెప్పింది నడుమందాల సుందరి.

చెప్పడానికి బానే ఉంది కాని, ఆ పాండ్స్, ఫేయిర్ అండ్ లవ్లీ యాడ్స్ లో చూపిస్తున్న చెత్తకి, ఇప్పుడు ఇలియానా మాట్లాడుతున్న నీతివాక్యాలకి అసలెమైనా సంబంధం ఉందా!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube