రకుల్ కి అలా చూస్తే ఇష్టం లేదట

సెక్సీభామ రకుల్ ప్రీత్ సింగ్ కి స్వాభిమానం ఎక్కువ.ఎవరి అండదండలు లేకుండా, చిన్న చిత్రాలతో మొదలుపెట్టి నేడు తెలుగులో అగ్రకథానాయికగా, దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నగా హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది రకుల్.

 I Don’t Underestimate Myself – Rakul Preet-TeluguStop.com

ఒకప్పుడు మోడల్ కూడా అవలేనేమో అనుకున్న రకుల్ కి ఇంత పట్టుదల ఎక్కడిది అని అడగగా ” నేను కష్టపడటం మా నాన్న నుంచే నేర్చుకున్నాను.నన్నెప్పుడు ఆడపిల్లలా పెంచలేదు ఆయన.చిన్నప్పుడు ఎక్కువగా మగపిల్లలతోనే ఆడేదాన్ని.అలాగే నేను గోల్ఫ్ ప్లేయర్ ని.స్పోర్ట్స్‌ పర్సన్ కి ఉండే తెగువ, ధైర్యం చాలా ఎక్కువ.ఎండలో ఎక్కువ గడపటం వలన నేను చాలా నల్లబడ్డాను.

ఒక దశలో నేను మోడల్ కాలేనేమో అనిపించినా, ధైర్యం కోల్పోకుండా అందాన్ని మెరుగుపరుచుకున్నాను.నాకు ఆటే అన్ని నేర్పింది.

అందుకే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తరువాత చాలాకాలం అవకాశాలు రాకపోయినా, ఓటమి ఒప్పుకోలేదు.నా కష్టం వల్లే ఈ రోజు ఈ పొజిషన్‌లో ఉన్నాను.నన్ను నేను ఎప్పుడు తక్కువగా చూసుకోను, ఎవరైనా అలా చూస్తే ఇష్టపడను, వాళ్లను పట్టించుకోను.” అంటూ తన విజయ రహస్యం బయటపెట్టింది రకుల్.

రకుల్ నటించిన నాన్నకు ప్రేమతో జనవరిలో, సరైనోడు ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube