కాజల్ కు అంత సీన్ లేదంట-I Don’t Have Guts To Do Female Lead Movies 3 months

Female Lead Movies Heroine Character Kajal Agarwal కాజల్ కు అంత సీన్ లేదంట Photo,Image,Pics-

కొద్దికాలంగా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన కాజల్ ఆ మధ్యలో ఫేడవుట్ అయినట్టు కనిపించింది కాని మళ్లీ ఇప్పుడు ఆమె కెరియర్ ఊపందుకుంది. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు ఆడకపోయినా ఆ సినిమాల అవకాశాలతో కాజల్ కెరియర్ లో కొత్త ఉత్సాహం తెచ్చింది. ఇక ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కాజల్ దగ్గర మీరు కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయొచ్చుగా అంటే బాబోయ్ నాకంత సీన్ లేదు అనేస్తుంది ఈ అమ్మడు.

స్టార్ హీరోయిన్స్ గా చెలామని అవుతున్న ప్రతి ఒక్క హీరోయిన్ ఇప్పుడు ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ తో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అభినేత్రి అనే ప్రయోగం చేసింది. అదే విషయాన్ని కాజల్ దగ్గర ప్రస్తావిస్తే మాత్రం నా మీద నాకంత నమ్మకం లేదు టోటల్ యూనిట్ అంతా తన మీద ఆధారపడి ఉంటుంది. సినిమా రిజల్ట్ అటు ఇటు అయితే తాను భరించలేను అందుకే కమర్షియల్ సినిమాల్లోనే హీరోయిన్ క్యారక్టర్ కాస్త కొత్తగా ఉంటే చేస్తా తప్ప తాను లీడ్ రోల్ గా అవకాశం వచ్చినా చేయను అని తెగేసి చెప్పింది కాజల్. మరి అమ్మడికి తన మీద తనకు నమ్మకం లేకుండటం కాస్త ఆశ్చర్యంగా ఉన్నా భారీ రెమ్యునరేషన్ వచ్చింది కదా అని చేతులు కాల్చుకోకుండా తనకు వచ్చిన నచ్చిన ఆఫర్స్ నే అంగీకరించడం మంచి విషయమే అంటున్నారు సిని జనాలు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. తమిళ హీరోలకి ఉన్న ధైర్యం తెలుగు హీరోలకి లేదా ?

About This Post..కాజల్ కు అంత సీన్ లేదంట

This Post provides detail information about కాజల్ కు అంత సీన్ లేదంట was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Kajal Agarwal, Female Lead Movies, Commercial Movies, Heroine Character, కాజల్ కు అంత సీన్ లేదంట

Tagged with:Kajal Agarwal, Female Lead Movies, Commercial Movies, Heroine Character, కాజల్ కు అంత సీన్ లేదంటCommercial Movies,Female Lead Movies,Heroine Character,Kajal Agarwal,కాజల్ కు అంత సీన్ లేదంట,,