మోడికి భయపడేది లేదు అంటున్న పవన్ కళ్యాణ్

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఉత్తర భారతానికి చెందిన ఐఏఎస్ అధికారుల చేతులో పెట్టడాన్ని విమర్శిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.నార్త్ ఇండియన్స్ ని ఇక్కడ నియమించడాన్ని నేను తప్పుబట్టట్లేదు అంటూనే, ఉత్తరభారతీయులని తిరుమలలో అధికారుల ఎలా నియమిస్తారని, ఉత్తరంలో ఉన్న పుణ్యక్షేత్రాలలో దక్షిణభారతీయులని ఎందుకు నియమించట్లేదు అని పవన్ ప్రశ్నించారు.

 I Am Not Scared Of Narendra Modi – Pawan Kalyan-TeluguStop.com

ఈ వాఖ్యలు ఎంత దూరం వెళ్ళాయి అంటే ఐఏఎస్ అధికారుల సంఘం దిగివచ్చి పవన్ కి సమాధమిచ్చింది.ఐఏఎస్ అంటే భారతందేశం అంతటా ప్రాంతీయ బేధం లేకుండా సర్వీసులు అందిచాలని, ప్రజల మధ్య గోడలు కట్టొద్దని ఐఏఎస్ అధికారులు బదులు ఇచ్చారు.

అయితే పవన్ తన వాఖ్యాలను తప్పుబట్టట్లేదు.తన మాటలకు ఇంకా కట్టుబడి ఉన్నానని, ఉత్తరభారతీయులను దక్షిణాది పుణ్యక్షేత్రాలలో నియమించినప్పుడు దక్షిణ భారతీయులని కూడా ఉత్తరభారత పుణ్యక్షేత్రాలలో నియమించాలని, అలా కాకుండా దక్షిణభారతీయులని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా చూస్తే అది దేశ ఐకమత్యాన్ని దెబ్బతీస్తుందని పవన్ చెప్పుకొచ్చారు.

ఈ విషయం కేవలం వాఖ్యాల వరకే ఆపనని, దేశవ్యాప్తంగా తీసుకెళతానని, మోడీని కలిసి కూడా మాట్లాడుతానని పవన్ చెప్పారు.“నేను మోడికి భయపడను.నిజం ఏమిటంటే ఆ విషయాన్ని ప్రధాని దృష్టి దాకా తీసుకెళ్లేందుకు సంశయించను” అంటూ పవన్ తన వాణిని వినిపించారు.

ఇదిలా ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో పవన్ ఇటు బీజేపీకి, అటు తెలుగుదేశం పార్టీకి తను ఇంతకాలం ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలుస్తోంది.

కమ్యునిస్టు పార్టీలతో పవన్ పొత్తుకూడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube