బెంగళూరు కన్నా..హైదరాబాద్ టాప్!!!

గత దశాబ్దకాలంగా ఈ ప్రాంతాన్నిఅట్టుడికించిన తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో హైదరాబాద్ భవితవ్యంపై రకరకాల విశ్లేషణలు వెలువడ్డాయి.ఆంధ్రుల రాకతోనే హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి జరిగిందని.

 Hyderabad Top Than Bengaluru-TeluguStop.com

రాష్ట్రం విడిపోతే.హైదరాబాద్ ప్రగతి కుంటుపడుతుందని కొందరు విశ్లేషించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా రాష్ట్రం విడిపోయన నేపథ్యంలో.హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఓ అమెరికన్ సంస్థ సర్వేలో హైదరాబాద్ దక్షిణాదిలో చెన్నై తర్వాతి స్థానంలో నిలిచిందని తేలిందట.ఆసక్తికరమైన విషయం ఏంటంటే.

దక్షిణాదిలోని ప్రముఖ నగరాల్లో మొదట చెన్నై, తర్వాత బెంగళూరు, ఆ తర్వాత హైదరాబాద్ ఉంటాయి.ఐతే ఈ సంస్థ సర్వే ప్రకారం.

హైదరాబాద్ బెంగళూరును వెనక్కి నెట్టేసిందట.తలసరి ఆదాయం, ఉద్యోగాల కల్పనలో బెంగళూరు కన్నా హైదరాబాద్ మంచి స్థానం సంపాదించిందట.

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 300 నగరాల జాబితాలో.భాగ్యనగరం 82వ స్థానంలో ఉందట.

బెంగళూరు 98వ స్థానంలో ఉందట.ఏది ఏమైనా ఇలానే హైదరాబాద్ టాప్ పొసిషన్ లో ఉండాలి అని అందరం కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube