హైద‌రాబాద్‌లో సోష‌ల్ మీడియా లెక్క ఇదీ

సోష‌ల్ మీడియా! ఇప్పుడు ఈ ప‌దం తెలియ‌ని వాళ్లు లేరు.త‌మ భావాల‌ను, అభిప్రాయాల‌ను నిస్సంకోచంగా పంచుకునే ఏకైక వేదిక సోష‌ల్ మీడియా.

 Hyderabad Social Media Calculation-TeluguStop.com

అదేస‌మ‌యంలో త‌మ ప‌ర్స‌న‌ల్సే కాకుండా ప‌బ్లిక్ పాయింట్ల‌ను సైతం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు పెట్టి.లైకులు, షేర్లు రాబ‌డుతున్న రోజులివి.

ముఖ్యంగా వాట్స‌ప్‌, ఫేస్‌బుక్ వంటివి ఇప్పుడు అన్ని చోట్లా స‌ర్వ‌సాధార‌ణం అయిపోయాయి.ప్ర‌ధానంగా దేశంలోని ఆరు మెట్రో న‌గ‌రాల్లో ఈ సోష‌ల్ మీడియా వినియోగం భారీ స్థాయిలో ఉంది.

ఎందుకంటే మెట్రో న‌గ‌రాల్లో సాఫ్ట్ వేర్ సంస్థ‌లు ఉండ‌డం దీనికి ప్రధాన కార‌ణంగా చెప్పొచ్చు.ఎక్కువ మంది యువ‌త కూడా ఈ న‌గ‌రాల్లోనే ఉండ‌డం మ‌రో కార‌ణం అయి ఉండ‌వ‌చ్చు.

దీంతో ఈ న‌గ‌రాల్లోని యువ‌త నిరంతరం సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు.ఇక‌, గ్రేటర్‌ సిటిజన్లు ప్రధానంగా రెండు సైట్లకే అధిక సమయం కేటాయిస్తున్నారట.

వాట్సాప్, ఫేస్‌బుక్‌లే ఎక్కువగా మహానగర వాసుల మనసు దోచుకుంటున్నాయట.

సోషల్ మీడియా ట్రెండ్స్‌ అనే సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

ఈ సోషల్‌ మీడియా వినియోగంలో దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల తీరును పరిశీలిస్తే హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది.తొలి మూడు స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ, ముంబై మహానగరాలు నిలిచాయని సోషల్‌ మీడియా ట్రెండ్స్‌ తెలిపింది.

ఐదో స్థానంలో చెన్నై, ఆరో స్థానంలో కోల్‌కతా నిలిచాయి.

ఇక‌, హైద‌రాబాద్ విష‌యానికి వ‌చ్చేస‌రికి.

కోటి జనాభాకు చేరువైన హైదరా బాద్‌ మహానగరంలో సుమారు 40 లక్షల మంది సామాజిక మాధ్యమాలను వినియో గిస్తున్నట్టు ఈ సర్వే అంచనా వేసింది.సామాజిక మాధ్యమాల్లో అత్యధిక సమయం గడుపుతున్న సిటిజన్లలో 18–35 ఏళ్ల వయసు వారే అధికంగా ఉన్నట్లు తేలింది.

యువత మాత్రం నిత్య జీవితంలో చోటుచేసుకునే ప్రతి అంశాన్నీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకునే విషయంలో ముందున్నారు.సో.ఇదీ హైద‌రాబాద్‌లో సోష‌ల్ మీడియా లెక్క‌!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube