హైదరాబాద్ కేటీఆర్ దే - కెసిఆర్

గ్రేటర్ హైదరాబాద్ ఎలెక్షన్ లలో తెరాస పార్టీ అధినేత కెసిఆర్ కొత్త కొత్త విషయాలు చెబుతున్నారు.పెరేడ్ గ్రౌండ్ లో జనాలు రావడం చూస్తుంటేనే తెరాస గెలుపు గ్రేటర్ లో ఖాయం అన్నట్టుగా కనిపిస్తోంది అని చెప్పారు ఆయన.

 Hyderabad Belongs To Ktr: Kcr-TeluguStop.com

హైదరాబాద్ అభివృద్ధి కేవలం తెరాస పార్టీ తో మాత్రమే సాధ్యం అని అంటున్నారు ఆయన.కారు గుర్తు కి ఓటు వేసి గెలిపించాలి అని ఆయన కోరారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తనయుడు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు కేటీఆర్ నగరంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారని వివరించారు.అందుకే హైదరాబాద్ నగరాభివృద్ధి బాధ్యతను కేటీఆర్ చేతిలో పెడతానని ప్రకటించారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ తన చేతిలో ఉందని త్వరలో ఆ శాఖ బాధ్యతలను కేటీఆర్ అప్పగిస్తానని చెప్పారు.

ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని తెలిపారు.

తాను ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించానని తెలిపారు.తెలంగాణ ప్రకటన వెలువడగానే ఆంధ్రా నాయకులు అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కావాలని తాము కరాఖండిగా చెప్పామన్నారు.హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ వంటిదని వ్యాఖ్యానించారు.

అందుకే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నగర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో జరుగుతోన్న ముఖ్యమైన ఎన్నికలని గుర్తుచేశారు.

హైదరాబాద్ను నాశనం చేసింది టీడీపీ కాంగ్రెస్ పార్టీలని అందుకే హైదరాబాద్లో టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube