Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఇంకో 13 ఏళ్ల తరువాత మనుషులు శృంగారం చేసుకోవాల్సిన అవసరం ఉండదట -Humans Would’t Prefer To Have $ex In Future – Says Scientists

టెక్నాలజీ ఎంత పెరిగితే, మనుషుల మధ్య దూరం కూడా అంత పెరుగుతుంది. ఈ విషయాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎప్పుడో చెప్పారు. ఒకప్పుడు సాయంత్రం అయ్యిందంటే చాలు పనులు పూర్తి చేసుకున్న పెద్ద మనుషులు ఓ చోట చేరి కబుర్లు పెట్టేవారు. పిల్లలైతే ఎన్నోరకాల ఆటలు ఆడుకునేవారు. టీవిలు వచ్చినప్పటినుంచి పెద్దోళ్ళ మాటలు, చిన్నోళ్ళ ఆటలు .. రెండూ మాయమయ్యాయి. ఇక స్మార్ట్ ఫోన్లు వచ్చాకా ఏం జరిగిందో చెప్పేదేముంది. బయట క్రికెట్ ఆడటం మానేసి, విడియో గేమ్ క్రికెట్ ఆడుతున్నారు. పండగలకు కలవడం మానేసి వాట్సాప్ లో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. స్నేహితులు ఓ చోట చేరితే కూర్చున్నంతసేపు ఎవరి ఫోన్ తో వారు బిజీగా ఉండి, కలిసినందుకు గుర్తుగా ఒక సెల్ఫి దిగుతున్నారు. ఇలా మన జీవితాల్ని ఆక్రమించేసి ఎన్నో సంతోషాలను దూరం చేసిన టెక్నాలజి త్వరలోనే మనిషికి శృంగారాన్ని కూడా దూరం చేయబోతున్నట్లు అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. 2030 సంవత్సరం వరకు మనుషులు శృంగారాన్ని తగ్గిచేస్తారట.

బిజీ లైఫ్ స్టయిల్, భాగాస్వాములిద్దరు పనిచేయడం వలన ఇప్పటికే మనుషుల మధ్య ఇటు మానసికంగా, అటు శారీరకంగా దూరం పెరిగిపోతోంది. అయినా, పిల్లలని కనాలనే ఒకేఒక్క కారణంతో శృంగారంలో పాల్గొనే జంటలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళు ప్రేమకొద్దీ శృంగారంలో పాల్గోనట్లేదు. యాంత్రికంగా, కేవలం పిల్లలని కనే యంత్రల్లాగా మారుతున్నారు. ఇక భవిష్యత్తులో పిల్లలని కనే పద్ధతి చాలావరకు మారిపోతుందని, కేవలం ప్రేమతో, కామంతో తప్ప, పిల్లలని కనడం కోసం మనుషులు శృంగారంలో పాల్గొనే అవసరం ఉండదు అంటున్నారు.

Continue Reading
More Posts
To Top