మనం కళ్ళతోనే ఫోటోలు తీసే రోజులొస్తున్నాయ్

దారిలో వెళుతుండగా ఏదో ఒక అద్భుత దృశ్యాన్ని చూశాం.ఏదో నేరం మన కంటబడింది.

 Human Eyes To Turn Into Camera Soon With Smart Contact Lens-TeluguStop.com

ఇంకేదో ఆసక్తికరమైన దృశ్యం కావచ్చు, అవసరమైన దృశ్యం కావచ్చు, మన కంటబడింది.మరి దాచుకోవాలంటే ఎలా? పబ్లిక్ లో ప్రతీ విషయాన్ని మొబైల్ తీసి ఫోటో తీయలేం కదా.ఎవరికి తెలియకుండా ఓ నేరాన్ని రికార్డు చేయడం కూడా కష్టమే కదా.మరి ఎలా?

ఇదే ఆలోచన సోని కంపెనీకి వచ్చింది.దానికు వారు కనుగొన్న పరిష్కారం స్మార్ట్ కాంటక్ట్ లెన్స్ .కళ్ళలో చాలామంది లెన్స్ వాడతారు కదా.ఆ లెన్స్ ని స్మార్ట్ చేయనున్నారు సోని కంపెనీ వారు.అంటే, కళ్ళలో ఏకంగా ఓ ఎలక్ట్రానిక్ పరికరాన్ని దాచేసుకోవచ్చు అన్నమాట.

మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆ స్మార్ట్ లెన్స్ ద్వారా మీ కళ్ళతోనే ఫోటోలు తీయవచ్చు, వీడియో రికార్డు చేయవచ్చు.అవసరం ఉన్నప్పుడు ప్లే చేసి చూసుకోవచ్చు.అచ్చం కెమెరా లాగే దృశ్యాన్ని జూమ్ చేయవచ్చు.మరి దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి? ఇది దేని సహాయంతో పనిచేస్తుంది అనే విషయాలు మాకు మాత్రమే కాదు, సోని కంపెనీకి కూడా తెలియవు.ఎందుకంటే, ప్రస్తుతం ఈ ఐడియా ఇంకా ఐడియాలానే ఉంది.దీన్ని పెటెంట్ చేయిస్తున్నారు.త్వరలోనే ఇలాంటి పరికరంతో మనముందుకి వస్తారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube