25 వేల మందికి ఆమెపై కోరిక

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీల జాబితా తీస్తే అందులో ముందు వరుసలో ఉంటుంది ముద్దుగుమ్మ పూనం పాండే.ఈ అమ్మడు సినిమాలతోనే కాకుండా తన ట్విట్స్‌తో పాటు హాట్‌ వీడియోలతో బాగా ప్రాచుర్యం పొందింది.

 Huge Response To Poonam Pandey Star Hunt-TeluguStop.com

తాజాగా ఈమె ఒక సినిమా చేయాలని నిర్ణయించుకుంది.అయితే ఈమెతో నటించేందుకు ప్రస్తుతం ఉన్న హీరోలు ఎవరు కూడా ముందుకు రాలేదు.

చిన్న హీరోలు సైతం ఈమెతో నటిస్తే కెరీర్‌ ఖతం అవుతుందనే ఉద్దేశ్యంతో నో చెప్పారు.దాంతో చిరెత్తుకు వచ్చిన పూనం స్టార్‌ హంట్‌ చేయాలని నిర్ణయించింది.

తాను చేయబోతున్న సినిమాలో తనకు జోడీగా నటించాలనే ఆసక్తి ఉన్న వారు సంప్రదించండి అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.ఏదైన విషయంపై అయిదు నిమిషాల యాక్టింగ్‌ చేసి తమకు పంపించాల్సిందిగా ఈమె పేర్కొంది.

పూనం స్టార్‌ హంట్‌కు అనూహ్యంగా స్పందన వచ్చింది.వెయ్యి లేదా రెండు వేల మంది వస్తారనుకున్న పూనం షాక్‌ అయ్యేలా ఏకంగా 25 వేల మంది తమ డెమోలను పంపించారు.

ఇంత మందిలోంచి తనకు కావాల్సిన వాడిని ఎంచుకోవడం ఎలారా బాబోయ్‌ అంటూ పూనం తల పట్టుకుంది.ఇంత మందికి పూనంతో నటించాలనే కోరిక ఉందన్నమాట.

మరి వీరిలో ఎవరి కోరిక తీరుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube