ఇప్పుడు ఇండియన్ సినిమా అభిమానుల్లో ‘బాహుబలి -ది కంక్లూజన్’.ఈ పేరు వినగానే భారతీయ సినీ ప్రేక్షకులకు ఏప్రిల్ 28వ తేదీ గుర్తుకొస్తుంది.
బాహుబలి – ది బిగినింగ్ సాధించిన విజయంతో ఇప్పుడు సౌత్ టు నార్త్ అన్ని భాషల వారు బాహుబలి – ది కంక్లూజన్ కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఏప్రిల్ 28 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
ఓ తెలుగు సినిమాకు ఇంతటి ఘనత దక్కడం వెనక ఈ క్రెడిట్ నూటికి నూరు శాతం దర్శకధీరుడు రాజమౌళికే చెందుతుంది.
రాజమౌళి గొప్ప విజన్, సాంకేతిక విలువలు, బాహుబలి – ది బిగినింగ్ సాధించిన విజయమే బాహుబలి – ది కంక్లూజన్ పై తారాస్థాయిలో అంచనాలు ఉండేందుకు కారణమయ్యాయి.
ఇక ఈ రెండు పార్టులకు గాను నిర్మాతలకు దక్కిన షేర్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు.బాహుబలి పార్ట్ 1 రూ.600 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది.ఇందులో నిర్మాతల షేర్ రూ.250 కోట్లు.ఇక ఇప్పుడు బాహుబలి 2 థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, గేమ్స్, ఇతర హక్కులన్ని కలుపుకుంటే నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు సుమారు రూ.400 నుండి రూ.500 కోట్ల వరకు షేర్ దక్కుంతుదని అంచనా.
ఓవరాల్గా రెండు పార్టుల మీద బాహుబలి నిర్మాతలకు రూ.750 కోట్ల షేర్ దక్కినట్టు తెలుస్తోంది.ఓ తెలుగు సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరగడం, షేర్ దక్కడం అంటే మామూలు విషయం కాదు.ఇక బాహుబలి 2 ఈజీగా రూ.1000 కోట్ల వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.