Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

2009 ప‌వ‌న్‌కు 2019 ప‌వ‌న్‌కు తేడా ఏమిటి..?-Huge Difference In Pawan

ప్ర‌శ్నిస్తానంటూ సింగ‌ల్‌గా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఇప్పుడు పొలిటిక‌ల్ గా అన్నీ అర్ధ‌మ‌వుతున్న‌ట్టే అనిపిస్తోంది! నిజానికి పొలిటిక‌ల్ ఎంట్రీ ప‌వ‌న్‌కి కొత్త కాదు. 2008లో త‌న అన్న చిరంజీవి పెట్టిన పార్టీ ప్ర‌జారాజ్యంతోనే అనుభ‌వం. అప్ప‌ట్లో యువ రాజ్యం విభాగం అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశాడు ప‌వ‌న్‌. ఆ సంద‌ర్భంగా 2009లో వ‌చ్చిన ఎన్నిక‌లు ప‌వ‌న్‌కి అనుభ‌వ‌మే. అప్ప‌ట్లో నేరుగా తాను యాక్టివ్ పాలిటిక్స్‌లోకి దిగ‌క‌పోయినా ప్ర‌చారం మాత్రం చేశాడు.

అయితే, ఇప్పుడు ప‌వ‌న్‌.. ఒంట‌రిగా పొలిటిక‌ల్‌గా ఎంట్రీ ఇవ్వ‌డం ఆస‌క్తిగా మారింది. 2014లోనే జ‌న‌సేన పార్టీని పెట్టిన ప‌వ‌న్‌.. పోటీకి అప్ప‌ట్లో దూరంగా ఉండిపోయాడు. ఏపీలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకి, కేంద్రంలో బీజేపీకి మ‌ద్ద‌తిచ్చి.. ప్ర‌చారంలో పాల్గొన్నాడు. ఇక‌, 2019 ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాను కూడా రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష పోటీకి దిగాల‌ని ఆయ‌న భావిస్తున్నాడు.

కానీ, ఇప్పుడు ప‌వ‌న్‌కి రాజ‌కీయాల్లో స‌క్సెస్ అవ్వ‌డం అనుకున్నంత వీజీ కాద‌ని అర్ధ‌మ‌వుతోంద‌ట‌! అప్ప‌ట్లో అంటే 2009 ఎన్నిక‌ల్లో ప‌రిస్థితికి రాబోయే 2019 ఎన్నిక‌ల ప‌రిస్థితి మ‌ధ్య ఉన్న తేడా ఇప్పుడు ప‌వ‌న్‌కి స్ప‌ష్టంగా అర్ధ‌మవుతోంద‌ట‌! అప్ప‌ట్లో కేవ‌లం త‌న అన్న పార్టీ స‌హా కాంగ్రెస్‌, టీడీపీలే బలంగా ఉన్నాయి. దీంతో ఎన్నిక‌ల్లో దిగ‌డం గెలవ‌డంపై ఒక‌విధ‌మైన అంచ‌నాలు ఉన్నాయి. కానీ, 2019 ఎన్నిక‌ల స్టైలే వేరుగా ఉండ‌నుంద‌ని ప‌వ‌న్ అంచ‌నా వేస్తున్నారు.

అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయా మార్పులు ప‌వ‌న్‌కి స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ట‌! ముఖ్యంగా ఏపీలో వైకాపా, టీడీపీలు హోరా హోరీ త‌ల‌ప‌డ‌నున్నాయి. దీనికి బీజేపీ కూడా తోడైంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా తిరిగి పుంజుకోవాల‌ని చూస్తోంది. ఈ నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌లకు త‌న జ‌న‌సేన‌ను ఎలా సిద్ధం చేయాలా? అని ప‌వ‌న్ స‌రికొత్త ప్ర‌ణాళిక‌ల‌తో ఉన్నాడ‌ట‌. ఏదేమైనా అప్ప‌ట‌కీ ఇప్ప‌ట‌కీ ప‌వ‌న్‌లో మాత్రం రాజ‌కీయంగా అనుభవం బాగా పెరిగింది.

Continue Reading
More Posts
To Top