‘బాహుబలి’ పుణ్యాన్న రానా..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ‘బాహుబలి’ ఫీవర్‌ కొనసాగుతోంది.ఇప్పటికే దేశ వ్యాప్తంగా అశేష ఆధరణ దక్కించుకున్న ‘బాహుబలి’ కోసం మరింతగా ప్రచారం చేస్తున్నారు.

 Huge Craze For Rana After Baahubali-TeluguStop.com

దాంతో ఈ సినిమాలో విలన్‌ పాత్రలో నటించిన రానాకు కూడా కొత్త గుర్తింపు దక్కుతోంది.ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉండే రానా తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ట్విట్టర్‌లో ఒక మిలియన్‌ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్‌ హీరోల సరసన రానా కూడా చేరాడు.

రానాకు ‘బాహుబలి’ వల్లే ఇంత క్రేజ్‌ అనేది అందరు ఒప్పుకోవాల్సిన నిజం.

తెలుగులో ఎలాగూ హీరోగా మంచి గుర్తింపే ఉన్న రానా తమిళం మరియు మలయాళంతో పాటు బాలీవుడ్‌లో మరింత గుర్తింపును తెచుకున్నాడు.ఆ గుర్తింపు వల్లే ట్విట్టర్‌లో రానా ఫాలోవర్స్‌ పెరిగారు అంటున్నారు విశ్లేషకులు.

ఇక ఈ సినిమా విడుదల తర్వాత రానాకు మరింతగా ఆధరణ లభించడం ఖాయం అని, ‘బాహుబలి’ రెండవ పార్ట్‌లో కూడా రానా ముఖ్య పాత్ర అవ్వడంతో ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య డబుల్‌ అయినా అయ్యే అవకాశాలున్నాయి అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.రానా విలన్‌గా నటించిన ‘బాహుబలి’ సినిమా వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube