హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ కలిసి సినిమాలు చేయకపోవచ్చు కాని, ఇద్దరి మధ్య మంచి స్నేహమే ఉంది.సైఫ్ చాలా సీనియర్ అయినప్పటికి, హృతిక్ సైఫ్ కన్నా చాలా పెద్ద స్టార్.
కాని వయసులో పెద్ద తేడా ఏమి లేదు.హృతిక్ వయసు 42, సైఫ్ వయసు 46.కాని ఇప్పటికి యంగ్ గా కనిపించే మన గ్రీకుదేవుడు హృతిక్ సైఫ్ అలీ ఖాన్ కూతురితో రొమాన్స్ చేయబోతున్నాడు.
సైఫ్ మొదటి భార్య సంతానం సారా ఆలీ ఖాన్ వయసు 24 సంవత్సరాలు.
ఈ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకోవాలని చాలామంది ప్రయత్నించినా నో చెప్పుకుంటూ వెళ్ళింది.మొత్తానికి తొలి చిత్రం హృతిక్ రోషన్ అనగానే ఎగిరి గంతేసింది.
హృతిక్ తో ఇప్పటికే అగ్నిపథ్ సినిమా తీసిన కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో ఈ ఇద్దరు జోడి కట్టనున్నారు.వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.