స్త్రీలు "అక్కడ" ఆ ఇన్ఫెక్షన్ రాకూడదు అంటే ఏం చేయాలి ?

మూత్రం మాటికి మాటికి వస్తూ ఉంటుంది.పీరియడ్స్ లో లేకున్నా ఒక్కోసారి మూత్రంతో పాటే కొద్దిగా రక్తం బయటకి వస్తుంది.

 How Women Should Prevent Uti Infections ?-TeluguStop.com

కొంచెం కంగారు పడతారు.ఇలా నాలుగైదు సార్లు జరిగితే భయం మొదలవుతుంది.

కాని అది ప్రైవేటు బాడి పార్ట్ కదా.అందుకే బయటకి చెప్పుకోవాలంటే మొహమాటం.ఒక్కోసారి మూత్రం బాగా వచ్చినట్టుగా అనిపించినా, బయటకి మాత్రం రాదు.మూత్రం రంగు మారుతుంది.సడెన్ గా జ్వరం కూడా వస్తుంది.ఈ లక్షణాలు అన్నిటికి మూలకారణం ఒకటే అని తెలుసా ? తెలియదు.చాలామంది స్త్రీలు ఈ సమస్యతో ఇబ్బందిపడ్డా, అసలు సమస్య ఏమిటి అనేది తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు.సమస్యని దాచుకుని పెద్దగా చేసుకుంటారు.ఈ సమస్య ఒక ఇన్ఫెక్షన్.దాని పేరే UTI.అంటే Urinary Tract Infection.

ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే ప్రథమంగా ఓ కారణం చెప్పుకోవచ్చు.Escherichia.coli అనే బ్యాక్టీరియా ఒకరకమైన ఫంగల్ బ్యాక్టీరియా.ఇది కాని స్త్రీ లేడి పార్ట్ లోకి వెళ్లి, యురేత్రాని ఎటాక్ చేసింది అనుకోండి, అక్కడినుంచి సమస్యలు మొదలవుతాయి.ఈ ఇన్ఫెక్షన్ బ్లాడర్ కి సోకవచ్చు, చివరకి కిడ్నీల దాకా కూడా వెళ్ళవచ్చు.

ఇది శరీరంలోని కింది భాగాల వ్యవ్యస్థని చాలా నష్టపరుస్తుంది.మరి ఈ సమస్యను ఎలా అడ్డుకునేది ?

* మూత్రాన్ని ఆపి ఉంచడం చాలా చెడ్డ అలవాటు.స్త్రీలకి ఇది ఇబ్బంది కలిగించే విషయమే కాని ఆరోగ్యం కోసం తప్పదు.నేచర్ కాల్స్ ని అప్పటికప్పుడే పూర్తీ చేయండి.* తడిసిన అండర్ వియర్ బ్యాక్టీరియాకి ఇల్లు లాంటిది.అండర్ వియర్స్ ఎప్పుడు డ్రై గా ఉండాలి.

అలాగే మీ లేడి పార్ట్ బయట కూడా తడి ఉండకుండా చూసుకోండి.

* నీళ్ళు బాగా తాగాలి.

మంచి నీళ్ళు సరిగా తాగకపోతే లేడి పార్ట్ లోపల అసిడిక్ వాతావరణం ఉంటుంది.దీంతో బ్యాక్టీరియా పెరుగుతుంది.

* షుగర్ లెవల్స్ ఎక్కువ ఉంటే ఈ బ్యాక్టీరియా పెరిగిపోతుంది.ఓరకంగా చెప్పాలంటే షుగర్ లెవల్స్ ఈ Escherichia.

coli అనే బ్యాక్టీరియాని పోషిస్తాయి.అందుకే షుగర్ లెవల్స్ తగ్గేలా చూసుకోండి.

* మెనోపాజ్ కి దగ్గర ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చిందంటే ఈస్త్రోజేన్ హార్మోన్ తరుగదల వలన కావచ్చు.అదే నిజమైతే డాక్టర్ ని సంప్రదించి ఈస్త్రోజేన్ థెరపి చేయించుకోండి.

* శృంగారంలో సురక్షితమైన పోజిషన్స్ వాడటం చాలాముఖ్యం.మంచి సెక్సాలాజిస్ట్ ని సంప్రదించి ఎలాంటి పోజిషన్స్ ఈ బ్యాక్టీరియా పెరుగుదలని ప్రోత్సహించవో ముందే తెలుసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube