Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

10 రోజుల్లో జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా పెరగాలంటే సులభమైన ఇంటి చిట్కాలు-How To Treat Hair Fall At Home

కొబ్బరి పాలలో ప్రొటీన్లు, ఆవశ్యక కొవ్వులు సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. కొబ్బరి కాయను తీసుకొని కొబ్బరిని తురిమి స్టవ్ మీద ఐదు నిమిషాల పాటు సిమ్‌లో వేడి చేయాలి. కొబ్బరి చల్లారిన తర్వాత నల్ల మిరియాల పొడి, మెంతులను వేసి నీటిని కలిపి పాలలా తయారుచేసుకోవాలి. ఈ పాలను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్యను అరికట్టి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. రెండు కప్పుల వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్లను ముంచి, ఆ నీరు చల్లారాక తల మాడు మీద పోసి నిదానంగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

బీట్‌రూట్‌లో విటమిన్ బీ6, విటమన్ సి,మాంగనీస్, బీటేన్, పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. 7-8 బీట్‌రూట్ ఆకులు, 5-6 గోరింటాకులను నీటిలో ఉడికించాలి. ఈ పేస్ట్ ని తలకు పట్టించి 20 నిముషాలు అయ్యాక వేడినీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

Continue Reading

Trending…

To Top