మేకప్ ని తొలగించటానికి సహజమైన పద్దతి

ముఖానికి వేసుకున్న మేకప్ ఎక్కువసేపు ఉంటే మొటిమలు మరియు అనేక చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.మేకప్ ని తొలగించటానికి మేకప్ రిమూవర్ కాకుండా ఇంటిలో సహజంగా లభించే కొన్ని వస్తువులతో మేకప్ ని సులభంగా తొలగించుకోవచ్చు.

 How To Take Your Makeup Off The Right Way-TeluguStop.com

ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఒక మెత్తని వస్త్రం మీద కొంచెం తేనే,బేకింగ్ పౌడర్ వేసి మేకప్ ని తొలగించుకోవచ్చు.

అలాగే బేబీ వైప్స్ కూడా బాగా సమర్ధవంతంగా పనిచేస్తాయి.వీటితో మేకప్ ని తొలగించటం వలన చర్మం రాపిడికి గురి కావటం,దురద,మంట వంటి సమస్యలు ఎదురు కావు.

ముఖానికి ఆవిరి పెడితే చర్మ రంద్రాలు తెరుచుకొని మేకప్ సులువుగా తొలగిపోతుంది.అలాగే ఆలివ్ నూనెలో కాటన్ బాల్ ముంచి ముఖాన్ని తుడిస్తే మేకప్ సులభంగా తొలగిపోతుంది.

పాలలో కాటన్ బాల్ ముంచి కళ్ళ కింద వేసుకున్న మేకప్ ని సులభంగా తొలగించవచ్చు.

మస్కారాను తొలగించటం కొంచెం కష్టమైన పని.మస్కారాను తొలగించటానికి బేబీ ఆయిల్ సహాయపడుతుంది.

కళ్ళ చుట్టూ,కనురెప్పలకు వేసుకున్న మేకప్ తొలగించటానికి పెట్రోలియం జెల్లీ సహాయపడుతుంది.

అయితే పెట్రోలియం జెల్లీ వాడాక తప్పనిసరిగా ముఖాన్ని పేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube