ప్లే స్టోర్ లో నకిలీ యాప్స్ ని గుర్తించడం ఎలా?

ఏదైనా ఒక కొత్త యాప్ కాస్త ఫేమస్ అయితే చాలు, దాని పేరుకి అటుఇటుగా నకిలీ యాప్స్ పుట్టుకొస్తాయి.వాటిని డౌన్లోడ్ చేసుకోని ఓపేన్ చేసే దాకా అవి నకిలీ అని తెలియకూడదు అనేంత పకడ్బందీగా కొన్ని యాప్స్ ని డిజైన్ చేసేస్తుంటారు.

 How To Spot Any Fake App In Google Play Store App Publisher-TeluguStop.com

పాపం, అమాయకులు, ఈ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోని, డేటా వేస్ట్ చేసుకోని, మళ్ళీ డిలీట్ చేస్తారు.అందుకే, ఒక నకిలీ యాప్ ని ఇది నకిలీ అని ఎలా పసిగట్టాలో చూడండి

* మొదట, ఆ యాప్ పబ్లిషర్ ఎవరో చూడండి.

మీరు ఇప్పటివరకూ వినని పేరు ఉంటే, ఆ కంపెనీ గురించి నిమిషం పాటు గూగుల్ లో సెర్చ్ చేయండి.నమ్మదగిన పబ్లిషర్స్ యొక్క యాప్స్ ని డౌన్లోడ్ చేయండి

* యాప్ విడుదల తేది చెక్ చేయండి.అక్కడే తెలిసిపోతుంది మీకు ఒరిజినల్ యాప్ ఎప్పుడు విడుదలైందో, ఈ నకిలీ యాప్ ఎప్పుడు వదిలారో

* అన్నటికన్నా ముఖ్యంగా, యాప్ డౌన్లోడ్ చేసేముందు ప్లేస్టోర్ లో ఉన్న రివ్యూ – రేటింగ్ చెక్ చేయండి.కొన్ని రివ్యూలు చదివాక, ఈ యాప్ ఎలా ఉండబోతోందో మీకు అర్థమయిపోతుంది

* అఫిషియల్ యాప్స్ చాలావరకూ ట్రైలర్స్ తో వస్తాయి.ప్లేస్టోర్ లో ఆ యాప్ కి సంబంధించిన ట్రైలర్ ఉందో లేదో చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube