మీ మెమోరి కార్డుని మీరే రిపేర్ చేసుకోండి ఇలా

మొమోరి కార్డ్ ఇక్కడ అందరు వాడుతున్నారుగా.స్మార్ట్ ఫోన్ ఉన్నా లేకున్నా, చిన్న మొబైల్స్ లేదా మ్యూజిక్ ప్లేయర్స్ లో మెమోరి కార్డ్ వాడుతుంటారుగా.

 How To Repair A Corrupted Memory Card ?-TeluguStop.com

ఈ మెమోరి కార్డ్ అప్పుడప్పుడు కరప్ట్ అయిపోతుంది.ఆ చిక్కులు మీకు తెలియనివి కావు చూడనివి కావు.

మెమోరిలో ఏదో వైరస్ చేరడం వలనో, కరప్ట్ ఫైల్ చేరటం వలనో, మొబైల్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది.అయితే ఈ మెమోరి కార్డు పట్టుకోని మీరెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు.

మీ మెమోరి కార్డుని మీరే రిపేర్ చేసుకోవచ్చు.ఎలానో చూడండి.

* కార్డ్ రీడర్ ద్వారా మీ మొమోరి కార్డ్ ని కంప్యూటర్‌కు కనెక్ట్ చేసాక, అది ఏ డిస్క్ లో కనబడుతోందో చూడండి.ఉదాహరణకు చెప్పాలంటే, Removable Disk (I:) ఇలా అన్నామాట.

* ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి.అంటే కీబోర్డు మీద Windows + R క్లిక్ చేసి Run లోకి వెళ్ళి, cmd అని టైప్ చేసి ఒకే చేయాండి.

కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది.

* కమాంట్ ప్రాంప్ట్ లో chkdsk I: /r అని టైప్ చేయాలి.ఇక్కడ I అక్షరం మీ మెమోరి కార్డ్ ఉన్న డిస్క్ అన్నమాట.మీ డిస్క్ ఒకవేళ Removable Disk (M:) అయితే M అని, ఇంకే అక్షరంతో ఉంటే అక్కడ ఆ అక్షరాన్ని వాడాలి.

* అంతే, విండోస్ మీ మెమోరి కార్డులో ఉన్న సమస్యలను గుర్తించి రిపేర్ చేస్తుంది.

* ఒక ముఖ్య గమనిక.మీకు అత్యవసరమైన ఫైల్స్ కి మాత్రం ముందే ఓ బ్యాకప్ పెట్టుకొని రిపేర్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube