స్మార్ట్ ఫోన్ వ్యసనం తగ్గాలంటే ఏం చేయాలి?

ఓరోజు నోట్ చేయండి .రోజుకి ఎంత సేపు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో లేదా, రోజుకి ఎంతసేపు స్మార్ట్ ఫోన్ మీద సమయం వృధా చేస్తున్నారో! నాలుపూటల అరగంట నుంచి గంట లెక్కేసుకున్నా, రోజుకి ఎన్ని గంటలు స్మార్ట్ ఫోన్ మీద గడుపుతున్నారో ఆలోచించండి.

 How To Reduce Your Smartphone Addiction-TeluguStop.com

అయితే, ఇది మినిమమ్ లెక్క.రోజంతా స్మార్ట్ ఫోన్ మీదే కూర్చునే జనాలు ఎంతమంది లేరు.

అదో వ్యసనం అయిపోయింది చాలామందికి.ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్, స్నాప్ చాట్ .ఇంకా ఇలాంటి పదుల యాప్స్ మన సమయాన్ని తినేస్తున్నాయి.అరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నాయి .మనిషి ఈ బనిసత్వం నుంచి ఎలా తప్పించుకోవాలి? క్రమక్రమంగా సెల్ ఫోన్ వాడకాన్ని ఎలా తగ్గించాలి?

* స్మార్ట్ ఫోన్ వ్యసనం తగ్గుముఖం పట్టాలంటే, సాధ్యమైనంతవరకు మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టులు పెట్టవద్దు.ఎందుకంటే ఒక్కసారి పోస్టు పెడితే, దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో నిమిషానికి ఓసారి చూడాలి అనిపిస్తుంది.

మన పోస్ట్ మీద ఎవరైనా కామెంట్ పెడితే దానికి రిప్లై ఇవ్వడం, మన రిప్లైకి తిరిగి వారు రిప్లై ఇవ్వటం .మళ్ళీ దానికి మన సమాధానం .ఇలానే గంటలు గడిచిపోతాయి.కాబట్టి, పోస్ట్ పెట్టాల్సినంత గొప్ప విషయం అయితే తప్ప, సోషల్ మీడియా పోస్టులు వద్దు.

రోజుకో అరగంట మీ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ కి కలిపి వాడుకుంటే చాలు.* అవసరం ఉన్నప్పుడే వైఫై ఆన్ చేసి పెట్టండి.

మిగితా సమయాల్లో వైఫై ఆఫ్ చేయండి.ఇంటర్నెట్ అలానే ఆన్ లో పెడితే నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, అవి వస్తున్నకొద్ది మనసు స్మార్ట్ ఫోన్ వైపు వెళుతూ ఉంటుంది.

ఆ తరువాత ఏముంది, గంటో, అరగంటో సమయం వృధా.

* స్నేహితులతో, చుట్టాలతో ఫోన్ లోనే మాట్లాడేందుకు ప్రయత్నించండి.

చాటింగ్ తగ్గిస్తే మంచిది.ఎందుకంటే చాటింగ్ అవసరం లేని విషయాలెన్నో డిస్కస్ చేస్తారు.

అనవసరంగా టైమ్ వేస్ట్.అదే ఫోన్ లో మాట్లాడితే, సూటిగా, ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాం.

* సినిమా చూడ్డానికి వెళ్ళి, నిమిషనిమిషానికి స్నేహితులకి అప్డేట్స్ పంపిస్తే థియేటర్లో సినిమా చూడ్డం ఎందుకు? ఏకాగ్రత ఉండదు.జూకి వెళ్ళారు, ఇంకేదైనా పిక్నిక్ కి వెళ్ళారు .ఎంతసేపు ఆ అందాలని మీ ఫోన్ కెమెరాలో బంధించడానికే ప్రయత్నిస్తారు తప్ప, వాటిని అస్వాదించరు.ఎందుకంటే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇంపార్టెంట్ అయిపోయింది.

అలా కాకుండా, మీరు ఆ ప్రదేశాన్ని వీడే చివర్లో ఫోటోలు తీసుకోని, తీరిక సమయాల్లో అప్లోడ్ చేసుకోండి.

* పిల్లలైతే బయట అడే ఆటలపై ఇష్టం పెంచుకోవాలి.

గ్రౌండ్ లోకి సెల్ ఫోన్ తీసుకోకపోవడమే మంచిది.ఇక పిల్లలైనా, పెద్దలైనా మీ స్మార్ట్ ఫోన్ లో ఎక్కువ యాప్స్ ఉంచుకోకండి.

యాప్స్ సంఖ్య పెరిగినాకొద్దీ వృధా అయ్యే సమయం కూడా పెరిగిపోతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube