మీ ఫోన్ పేలకూడదు అంటే ఈ పనులు చేయండి-How To Protect Your Mobile From Over Heating ? 4 months

Apps Running In The Background Battery Charging How To Protect Your Mobile From Over Heating ? Reboot Phone Switch Off Photo,Image,Pics-

ఈమధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం ..స్మార్ట్ ఫోన్స్ బ్లాస్ట్ అయిపోతున్నాయి. సాంసంగ్ నోట్ 7 ఫోన్లను ఏకంగా విమానాల్లో అనుమంతించని పరిస్థితి కూడా వచ్చింది. ఇలా ఎందుకు అవుతోంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఓవర్ హీటింగ్ వలన, బ్యాటరీ సరిగా లేకపోవడం వలన. మన ఫోన్లు కూడా హిటెక్కిపోవడం చూస్తుంటాం. మరి ఏం చేయాలి? ఫోన్ హీట్ అవకూడదు అంటే ఏం చేయాలి?

* అన్నిటికన్నా ముందు, ఫోన్ ఎంపిక సరిగా జరగాలి. ఒక స్మార్ట్ ఫోన్ కొనేముందు దాని గురించిన పూర్తి వివరాలు సేకరించాలి. హీటింగ్ ప్రాబ్లమ్ ఉందా, ఎలాంటి బ్యాటరీ వాడుతున్నారు, RAM ఎంత, ఎలాంటి ప్రాసెసర్ తో ఆ ఫోన్ మర్కేట్లోకి వస్తోంది .. ఇవన్ని ఆరాతీయాలి. అన్ని సవ్యంగా ఉంటేనే కొనాలి.

* ఫోన్ గంటలకొద్దీ ఎలాంటి విరామం లేకుండా వాడితే ఏ ఫోన్ అయినా హీట్ అవుతుంది. ఇన్ బిల్ట్ గా ఫోన్ టెంపరేచర్ చెక్ చేసే వీలుంటే చేయండి, లేదాంటే ఫోన్ టెంపరేచర్ చెక్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి. ఫోన్ టెంపరేచర్ పెరిగితే కాసేపు ఫోన్ ని పక్కనపెట్టండి.

* ఫోన్ ని అప్పుడప్పుడు రీబూట్ లేదా స్విచ్ఛాఫ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే హీటింగ్ తగ్గుతుంది.

* బ్యాటరీ సరిగా పనిచేయకపోతే ఫోన్ ఈజీగా హీట్ అవుతుంది. ఇప్పుడు సాంసంగ్ నోట్ 7 తో వచ్చిన సమస్యే ఇది. బ్యాటరీ సరిగా లేకే అవి పేలుతున్నాయి.

* ఫోన్ ని ఎక్కువగా హీట్ ఎక్కించేది గేమింగ్. కొందరైతే నీడ్ ఫర్ స్పీడ్, బ్యాట్ మెన్ లాంటి హేవీ గేమ్స్ కూడా గంటలకొద్దీ ఆడేస్తుంటారు. గేమింగ్ మీద ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తే ఫోన్ చాలా త్వరగా, చాలా ఎక్కువగా హీట్ ఎక్కిపోతుంది.

* అదేపనిగా ఆన్ లైన్ స్ట్రీమింగ్ చేస్తే కూడా ఫోన్ హిట్ అవుతుంది. కాబట్టి అవసరం మేరకు, మీ బ్యాటరీ లైఫ్ ని బట్టి స్ట్రీమింగ్ చేయాలి.

* ఫోన్ బ్యాటరీ 20% కన్నా తక్కువగా ఉంటే, దాన్ని పెద్దగా వాడకండి, ముఖ్యంగా కాల్స్ చేయడం కాని, తీసుకోవడం కాని వద్దు.

* అవసరమైన అప్లికేషన్స్ మాత్రమే వాడండి. ఆప్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే, హీటింగ్ అంత ఎక్కువగా అవుతుంది.

* మల్టీ టాస్కింగ్ చేయడంలో తప్పు లేదు కాని, ఒక అప్లికేషన్ లో పని అయిపోగానే దాన్ని మినిమైజ్ చేసే బదులు క్లోజ్ చేయండి. RAM మీద ఒత్తడి తీసుకురావొద్దు.

* ఇక చివరగా, ఫోన్ ని ఛార్జింగ్ లో పెట్టినప్పుడు ఫోన్ మాట్లాడటం కాని, ఫోన్లో ఏదైనా మీడియా ఫైల్ ప్లే చేయడం కాని వద్దు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. వామ్మో .. పోర్న్ స్టార్స్ అంతలా కష్టపడతారా!

About This Post..మీ ఫోన్ పేలకూడదు అంటే ఈ పనులు చేయండి

This Post provides detail information about మీ ఫోన్ పేలకూడదు అంటే ఈ పనులు చేయండి was published and last updated on in thlagu language in category AP Featured,Genral-Telugu,Telugu News.

How to protect your mobile from over heating ?, Android Phone Tips, Battery, Charging, Reboot Your Phone, Switch Off, apps running in the background

Tagged with:How to protect your mobile from over heating ?, Android Phone Tips, Battery, Charging, Reboot Your Phone, Switch Off, apps running in the backgroundAndroid Phone Tips,apps running in the background,Battery,charging,How to protect your mobile from over heating ?,Reboot Your Phone,Switch Off,,Bol Baby Bol Telugu Video Download -atho Athamma Kuthuro,Www Child Telugu Rhymes Com