ఆరోగ్యం కోసం రోజుకి ఎన్నిపూటలు తినాలి? ఏ టైంలో తినాలి?

మీరు రోజుకి ఎన్ని పూటలు శరీరానికి ఆహారాన్ని అందిస్తారు? ఈ ప్రశ్న అడిగితే ఠక్కున మూడుపూటలు అని అంటారు.కాని మన శరీరానికి ఓ రోజులో 8 సార్లు ఆహారాన్ని అందించాలట.

 How To Plan 8 Meals In A Day? Perfect Diet Plan-TeluguStop.com

ఇది ఎవరో చెబుతున్న మాట కాదు, డైటిషియన్స్ చెబుతున్న మాట.ఉదయం నుంచి రాత్రి వరకు 8 మీల్స్ బాడికి అవసరం.అలాగని 8 సార్లు దండిగా తినేరు.కేవలం తినడాన్నే ఆహారం అని అనరు కాదు, ద్రవపదార్థము కూడా అహారమే.ఈరకంగా 8 సార్లు ఎలా తినాలో/తాగాలో .ఏం ఏం తీసుకోవాలో చూద్దాం.

1) పొద్దున్నే లేచిన కొద్దినిమిషాల్లో మంచినీళ్ళు తాగి, డీహైడ్రేట్ గా ఉన్న శరీరాన్ని హైడ్రేటెడ్ చేసుకోండి.గత ఏడెనిమిది గంటల్లో మీ శరీరంలోకి ఎలాంటి ద్రవపదార్థము వెళ్ళలేదు కదా.కాబట్టి ఇది అవసరం.ఉదయాన్నే ఆరు గంటలకి నిద్రలేస్తే, 6:15 నిమిషాల సమయంలో ఈ పని చేస్తే సరి.

2) పర్సనల్ కార్యక్రమాలు పూర్తిచేసుకోని, 6:45-7.00 నిమిషాల మధ్య కాఫీ, గ్రీన్ లాంటిది తీసుకోండి.టీ/కాఫీ అలవాటు లేకపోతేనే బెటర్.గ్రీన్ టి, నిమ్మరసం .డిటాక్సిఫీకేషన్ కి పనికొచ్చే ఏదైనా పండ్ల రసం తీసుకోండి.

3) 7:30 సమయంలో ఆరోగ్యకరమైన టిఫిన్ తీసుకోండి.నూనె లేని ఇడ్లి అయిన, న్యూట్రీషన్ గల వెజ్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ లాంటిది.

4) 10:30 – 11:00 మధ్య నట్స్, బీన్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.కుదిరితే ఓ పది నిమిషాలు ఎండలో నిలబడి విటమిన్ డి పొందాలి.ఉడకబెట్టిన గుడ్డు కూడా తినొచ్చు ఈ సమయంలో.

5) 1:00 – 2:00 మధ్యలో లంచ్ చేయండి.రైస్ తీసుకోండి కాని లిమిట్ లో.పెరుగుతో కూడా కలిపి తినండి.కూరల్లో పప్పు ఉండేలా చూసుకోండి.

6) 4:00 – 5:00 మధ్య గ్రీన్ టీ తాగితే మేలని డాక్టర్లు చెబుతున్నారు.స్నాక్స్ సమయం కదా అని మసాలా ఉండే ఆహారాన్ని తినేయొద్దు.

7) 6:00 – 7:00 మధ్య చపాతి కాని, గోధుమలతో చేసిన ఆరోగ్యకరమైన పదార్థాలని కాని తీసుకోవచ్చు.ఏం తిన్నా, లైట్ గా తినండి.రాత్రి నిద్రకి ఆటంకం కలిగించని ఆహారాన్ని తీసుకోండి.

8) 8:00 – 9:00 మధ్య పాలు లేదా పెరుగు తాగండి.శరీరంలో టెంపరేచర్ తక్కువ అవుతుంది.హాయిగా నిద్రపడుతుంది.

ఇదండీ 8 సమయాల్లో మన శరీరానికి ఆహారాన్ని అందించే విధానం.ఈ డైట్ లో మీకు కావాల్సినన్ని కాలరీలతో పాటు, న్యూట్రింట్స్ కుడా దొరుకుతున్నాయి.

పదార్థాలు మార్చినా, ఈ టైమింగ్స్ ఇతర ఆహారపదార్థాలతో (ఆరోగ్యకరమైనవే) పాటించేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube