Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

దేవుడి గదిలో విరిగిపోయిన ఫోటోలను ఏమి చేయాలి ?-How To Keeping Is Breaking Of Gods Photos

దేవుడి గదిలో పూజలు చేసే ఫోటోలు విరగటం లేదా విగ్రహాలు ఆకారం మారటం వంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కొంత మంది వీటిని గుడిలోనో, రోడ్డు పక్కన చెట్ల కిందో పడేస్తూ ఉంటారు. ఆలా చేయటం చాలా తప్పు. మరి కొంత మంది విరిగిపోయిన దేవుని ఫోటోలను ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు.

విరిగిపోయిన దేవుడి ఫోటోలను అగ్నికి ఆహుతి ఇవ్వడం మంచి పద్దతి. అదేంటి దేవుడి ఫోటోలను అగ్నికి ఆహుతి చేయవచ్చా అని సందేహం చాలా మందికి వస్తుంది. అగ్నిదేవుడు బ్రహ్మ మానస పుత్రుడు. విరాట్పురుషుని నోటి నుండి ప్రభావించాడు. అంతేకాక అగ్ని సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. ఆయన త్వాగాలను స్వీకరించే దేవుడు.

అందువల్ల పవిత్రాగ్నిలో దేవుని ఫోటోలను వేయటం తప్పు కాదు. అలాగే ప్రవహిస్తున్న నదిలోగానీ, చెరువుల్లో గానీ నిమజ్జనం చేయండి. అయితే అగ్నిలో, నదిలో వదిలే ముందు వాటికి నమస్కరించి ” గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ” అని స్మరిస్తూ విడిచిపెట్టాలి. ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి. విరిగిపోయిన దేవుని ఫోటోలను ఈ విధంగా చేయటం మన కర్తవ్యం అని గుర్తు పెట్టుకోవాలి.

Continue Reading

Trending…

To Top