వీర్యం ఎక్కువ పడాలంటే ఏం చేయాలి ?

అంగస్తంభన లేమి, శీఘ్రస్కలనం .వీటి తరువాత మగవారు సెక్స్ జీవితంలో ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య వీర్యం తక్కువగా రావడం.

 How To Increase Semen Volume-TeluguStop.com

బయటకి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాని ఇలాంటి సమస్యతో కూడా చాలామంది మగవారు ఇబ్బందిపడతారు.వీర్యం తక్కువగా, పల్చగా పడటం వీరి సమస్య.అసలు మగవారు ఎంత వీర్యాన్ని బయటకి వదలాలి ? ఎంత విడుదల చేస్తే అది మంచిది ? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం అయితే సగటున 3.7 మిల్లిలిటర్ల వీర్యం బయటకి రావాలి.ఈ నంబర్ కి అటుఇటుగా వీర్యం పడుతున్న ఫర్వాలేదు మీరు నార్మల్ కండీషన్ లో ఉన్నట్టే.కాని 1.5 మిల్లి లీటర్ల కిందకి మీ వీర్యం పడిపోయింది అంటే మాత్రం మీరు ప్రమాదంలో ఉన్నట్లే.దీనర్థం మీ ఒంట్లో వీర్యం సరిగా ఉత్పత్తి కావట్లేదు.

ఈ సమస్య ఈ వయసులో వస్తుందని చెప్పలేం .ఇది ఎప్పుడైనా రావొచ్చు.విచిత్రంగా, 20- 40 ఏళ్ల మగవారికే ఈ సమస్య ఎక్కువ ఉంటోందని చెబుతున్నాయి పరిశోధనలు.ఎలాగని 40 లు దాటినవారికి ఈ సమస్య ఉండట్లేదు అని కాదు, కాని ఆ వయసులో వారికి వీర్యం ఎంత పడుతోంది అనేది పెద్ద సమస్య కాకపోవచ్చు, వారికి అంగం సరిగా స్తంభిస్తే చాలు.

కాని 20-40 ఏళ్ల వయసులో ఉన్నవారికి మాత్రం వీర్యం యొక్క వాల్యూం అవసరం.కాబట్టి … ఈ సమస్య ఎందుకు వస్తుందో … దీనికి పరిష్కార మార్గాలేంటో ఓసారి చూడండి.

#1.ఇవి మానేయండి :

వృషణాల మీద ఒత్తిడి తెచ్చే ఏ పని చేయకూడదు.వృషణాల మీద ఒత్తిడి పడితే అది వీర్య ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.సైకిల్ తొక్కడం వలన వృషణాలపై ఒత్తిడి బాగా పడవచ్చు.సీట్ మీద కుర్చోని రెండు కాళ్ళని అదే పనిగా ఆడించడం వలన ఇలా జరగుతుంది.బైక్ మీద ఎక్కువసేపు కూర్చోవడం వలన కూడా ఇలా జరగొచ్చు.

కొందరు కండలు పెంచుకోవడానికి కొన్ని పద్ధతులు పాటిస్తారు.అందులో స్టీరాయిడ్స్ తీసుకోవడం ఒకటి.

అనాబోలిక్ స్టీరాయిడ్స్ మీ ఆరోగ్యానికి మంచివి కావు.ఇవి మీ వృషణాల మీద చెడు ప్రభావం చూపుతాయి.

దాంతో వీర్యం తక్కువగా పడవచ్చు.ఇక ల్యాప్ టాప్ ని తొడమీద పెట్టుకోని పనిచేయడం మీ వీర్య ఉత్పత్తిని దారుణంగా దెబ్బతీస్తుందని మీకు తెలిసిందే.

పెనెట్రేషన్ సులువుగా మార్చడం కోసం భాగస్వాములు లూబ్రికెంట్స్ వాడతారు.ఇవి కూడా స్పెర్మ్ వాల్యూమ్ ని తగ్గిస్తాయి.

తక్కువ సేపు నిద్రపోవడం కూడా వీర్య ఉత్పత్తిని తగ్గిస్తాయి.కాబట్టి నిద్ర కూడా సంపూర్ణంగా ఉండాలి.

బరువు ఇటు తక్కువగా ఉండకూడదు, ఇటు ఎక్కువగా ఉండకూడదు, సరైన బరువు మేయింటేన్ చేయకపోవడం వలన కూడా వీర్మ యొక్క వాల్యుమ్ పడిపోతుంది.ఇక వృషణాల మీద ఒత్తిడి పెంచే మరో విషయం టైట్ గా ఉండే అండర్ వియర్స్ వాడటం.

వదులుగా ఉండే అండర్ వియర్స్ వాడాలి.లేదంటే కష్టమే.

#2.విటమిన్ సి, విటమిన్ డి, జింక్

వీర్యం బాగా పడాలంటే యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువగా దొరికే ఆహారపదార్థాలు తినాలి.ఉదాహరణకు చెప్పాలంటే నిమ్మ, ఆరెంజ్.250 మిల్లిలీటర్ల ఆరెంజ్ జ్యూస్ తాగితే 125 మిల్లిగ్రాముల దాకా విటమిన్ సి దొరుకుతుంది.ఈ మాత్రం విటమిన్ సి మనకు రోజు కావాలి.అప్పుడే వీర్యం హెల్తిగా, బలంగా ఉండి, ఎక్కువగా బయటకి వస్తుంది.

విటమిన్ డి, కాల్షియం .ఈ రెండి ఎలిమెంట్స్ రోజు ఒంట్లో పడాలి.విటమిన్ డి కోసం కాసేపు ఎండలో నిల్చున్న సరిపోతుంది.మన భారతీయ వాతవరణంలో అయితే 10am – 11am మధ్య ఓ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నిల్చుంటే సరిపోతుంది.

లేదు అంటే బీఫ్, చీజ్, కొడి గొడ్డులోని పసుపు భాగం, తూనా ఫిష్, సాల్మాన్ లాంటి సీ ఫుడ్ తీసుకోవాలి.కాల్షియం కోసం పాలు బాగా తాగాలి, పెరుగుతో ఎక్కువ తినాలి, బ్రొకోలి, చీజ్ కూడా ఎక్కువ తినవచ్చు.

ఇక జింక్ ఎక్కువగా తీసుకుంటే సెమెన్ వాల్యూం పెరుగుతుంది.పాలకూర, కిడ్నిబీన్స్, ఓయ్ స్టర్స్, పుచ్చకాయ విత్తులు, బీఫ్, అల్లం, ఉల్లి, పల్లిలు తీసుకోవాలి.

#3.మంచినీరు – హస్తప్రయోగం – ట్రొబులీస్

నీళ్ళు ఎంతబాగా తాగితే వీర్యం అంత ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.ఎందుకంటే 90% వీర్యం తయారయ్యేది నీటితోనే.వీర్యం ఎంత బాగా ఉత్పత్తి అయితే అంత బాగా బయటకి వస్తుంది.కాబట్టి నీళ్ళు బాగా తాగాలి.ఇక వీర్యం బాగా పడాలంటే కలయికకి ఒక రోజు ముందు నుంచైనా హస్తప్రయోగం చేసుకోకపోవడం మంచిది.

ఎందుకంటే హస్తప్రయోగం వలన వీర్యం బయటపడుతూ, పల్చటి వీర్యం బయటకి వస్తు ఉంటుంది.మళ్ళీ క్వాలిటి ఉన్న వీర్యం బయటకు రావాలంటే కొంచెం సమయం పడుతుంది.

అంటే శరీరానికి కొంత సమయం కావాలన్నమాట.అలాంటప్పుడు హస్తప్రయోగం కలయిక సమయంలో చేయకూడదు.

ట్రిబులీస్ హర్బ్ ని సూపర్ సెక్సువల్ హర్బ్స్ అని అంటారు.ఇలా ఎందుకు అంటారు అంటే ఇది మగవారిలో కామదాహాన్ని రగిలించే హార్మోన్స్ ని ఎక్కువగా విడుదల చేస్తుంది.

అంటే టెస్టోస్టిరోన్ కౌంట్‌కి విపరీతంగా పెరిగిపోతుందన్నమాట.టెస్టోస్టిరోన్ పెరిగినాకొద్ది సెమెన్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది.

ఈ హర్బ్స్ ని శాస్త్రవేత్తలు కొన్ని జంతువుల మీద ప్రయోగించి చూసారు.వాటిలో గణణీయంగా వీర్యం ఉత్పత్తి పెరగటం, వీర్యం ఎక్కువ మొత్తంలో విడుదల అవడం గమనించారు.

మరి ఇది మనుషుల శరీరంలో కూడా పనిచేస్తుందా అంటే పనిచేస్తుందట.

#4.స్మోకింగ్ – డయాబెటిస్ – ప్రొలాక్టిన్

స్మోకింగ్ అంటే ధూమపానం ఒంట్లో టాక్సిన్స్ పెంచుతుందని తెలుసు, ఊపిరితిత్తులను, కిడ్నీలను నాశనం చేస్తుందని కూడా తెలుసు .కాని సిగరేట్లు చేసే హాని అక్కడితో ఆగిపోలేదు.సిగరేట్లు వీర్య ఉత్పత్తిపై కూడా దుష్ప్రభావం చూపుతాయి.స్మోకింగ్ చేసే మగవారి గుంపు, స్మోకింగ్ చేయని మగవారి గుంపుని కంపేర్ చేసుకోని చూస్తే, ఈ రెండు గుంపుల్లో టెస్టోస్టిరోన్, LH & FSH లెవల్స్ లో పెద్దగా తేడాలు కనిపించకపోవచ్చు, అలాగే మొబిలిటిలో కూడా పెద్దగా తేడా ఉండకపోవచ్చు కాని తేడా ఎక్కడ వస్తుంది అంటే సెమెన్ వాల్యూమ్ లో.అవును, ధూమపానం అలవాటు స్పెర్మ్ వాల్యూమ్, అంటే వీర్యం బయటకువచ్చే మోతాదుని దారుణంగా కిందపడేస్తుంది.ఇందుకోసమైనా సిగరేట్ అలవాటు మానేయ్యాలి.

మధుమేహంతో బాధపడేవారు కుడా ఎక్కువ వీర్యాన్ని విడుదల చేయలేరని పరిశోధనలు చెబుతున్నాయి.రెట్రోగరేడ్ ఎజాకులేషన్ అనే పేరు గల ఈ సమస్య డయాబెటిస్ వలనే వస్తుందని రిసర్చర్స్ చెబుతారు.

షుగర్ వ్యాధితో బాధపడేవారి స్పెర్మ కాంసన్ట్రేషన్ లో పెద్దగా తేడా ఉండకపోవచ్చు కాని, స్పెర్మ వాల్యూ మాత్రం ఖచ్చితంగా పడిపోతుందట.అందుకే, శరీరానికి డయాబెటిస్ వచ్చేంత అజాగ్రత్తగా లైఫ్ స్టయిల్ ఉండకూడదు.

ఒంట్లో హై ప్రొలాక్టిన్ లెవల్స్ ఉంటే అది కూడా టెస్టోస్టిరోన్ లెవల్స్ పడిపోయేలా చేస్తుందట.అందుకే ప్రొలాక్టిన్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయో లేవో పరీక్షలు చేయించుకోవాలి.

పరిష్కారం కోసం డాక్టర్ ని సలహాలు అడగాలి.

#5.భాగస్వాముల మధ్య ప్రేమ

ప్రేమ ఉన్న సెక్స్ జీవితం వేరు, ఏదో శారీరక తృప్తి కోసం చేసే సెక్స్ వేరు.భాగస్వాముల మధ్య ప్రేమ లేకపోతే అది స్ట్రెస్ కి దారి తీస్తుంది.

స్ట్రెస్ అంటే విపరీతమైన మానసిక ఒత్తిడి.ఈ మానసిక ఒత్తిడి వలన శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొదలువుతాయి.

హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పితే అది స్పెర్మ్ కౌంట్ మీద, సెమెన్ వాల్యూమ్ మీద నెగెటివ్ ప్రభావం చూపుతుంది.ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, భాగస్వాముల మధ్య అనోన్యత లేక సెక్స్ మీద అనాసక్తి పెరగడం వలన.

సెక్స్ మీద అనాసక్తి పెరగటం అంటే లిబిడో తగ్గడం .లో లిబిడో అంటే మగవారిలో టెస్టోస్టిరోన్ తరుగుదలకి సంకేతం.టెస్టోస్టిరోన్ తగ్గితే స్పెర్మ్ కౌంట్, సెమన్ వాల్యూమ్ తగ్గినట్టే .ఓరకంగా చెప్పాలంటే ఇదంతా ఓ చైన్ ప్రాసెస్.ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ అయ్యి ఉంటుంది.

మానసిక సమస్యలు ఏవైనా సరే .అది భాగస్వామితో గొడవ కావచ్చు, పనిఒత్తిడి కావచ్చు, సెక్స్ అంటే భయం, అయిష్టత, పిల్లలు పుడితే ఎలా పోషించాలి అనే ఆలోచన, ఆర్థక సమస్యలు .ఇలా ఎలాంటి మెంటల్ ఇష్యూ అయినా, అది సెమెన్ ప్రొడక్షన్ మీద, సెమెన్ వాల్యూమ్ మీద డైరెక్ట్ గా అయినా, ఇండైరెక్ట్ గా అయినా ప్రభావం చూపుతాయి.కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube