సన్ బర్న్ వదిలించుకోవటానికి సాదారణ మార్గాలు

ఇంటి చిట్కాలతో ఒక్క రాత్రిలో సన్ బర్న్ వదిలించుకోవటం సాధ్యమేనా? సన్ బర్న్ ఒక తీవ్రమైన సమస్య కావచ్చు.అంతేకాక చర్మాన్ని తొందరగా తాన్ కి గురి చేస్తుంది.

 How To Get Rid Of Sunburn Fast-TeluguStop.com

బయట ఎక్కువసేపు గడపటం వలన సన్ బర్న్ వస్తుంది.సన్ బర్న్ కారణంగా వచ్చే దురద మరియు ఎరుపు నుండి ఉపశమనం పొందడానికి ఇంటి చిట్కాలు సహాయపడతాయి.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1.కొబ్బరి నూనె మరియు ఆపిల్ సైడర్ వెనిగర్


కావలసినవి
కొబ్బరి నూనె
ఆపిల్ సైడర్ లో వెనిగర్
1 స్ప్రే బాటిల్

పద్దతి


* ఒక స్ప్రే సీసా లో ఒక కప్పు చల్లని నీరు మరియు పావు కప్పు ఆపిల్ సైడర్
వెనిగర్ లను పోసి బాగా కలపాలి
* మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో స్ప్రే చేయాలి
* కొంత సమయం వేచి ఉంటే ఉపశమనం కలుగుతుంది
* ఒకవేళ స్ప్రే చేయటం కుదరకపోతే, పైన తయారుచేసుకున్న మిశ్రమంలో కాటన్
క్లాత్ ని ముంచి ప్రభావిత ప్రాంతంలో పెట్టవచ్చు

2.బ్లాక్ టీ


బ్లాక్ టీ లో ఫోటో న్యూ త్రియంత్స్ మరియు యాంటి ఆక్సిడెంట్స్ కలిగి నయం చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది

కావలసినవి


ఒక స్నానపు తొట్టె
ఒక కుజా

క్లాత్ బ్లాక్ టీ బాగ్స్ – 3

పద్దతి


* కూజాను తీసుకోని దానిలో వేడి నీటిని నింపాలి.

* ఆ నీటిలో బ్లాక్ టీ సంచులను వేసి నలుపు రంగు వచ్చేవరకు నానబెట్టాలి.* ఈ నీటిని సన్ బర్న్ ప్రభావిత ప్రాంతంలో నిదానంగా రాయాలి.

* ఆరిన తర్వాత కాటన్ టవల్ తో పొడిగా తుడవాలి.* మరల బ్లాక్ టీ నీటిని రాయవచ్చు.

* రాత్రి సమయంలో బ్లాక్ టీని రాసి మరుసటి రోజు స్నానం చేయాలి.* సాదారణంగా సన్ బర్న్ నయం కావటానికి ఒకటి లేదా రెండు రోజులు రాయాలి.* ఒకవేళ టీ సంచులను నానబెట్టటానికి సమయం లేకపోతే, వాటిని తడిపి ప్రభావిత ప్రాంతంలో పెట్టవచ్చు.

3.నిమ్మరసం, రోజ్ వాటర్ మరియు దోసకాయ ప్యాక్


ఈ పదార్ధాలు అన్ని మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి.దోసకాయ మరియు నిమ్మకాయలో సహజసిద్దమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన సన్ బర్న్ తగ్గించటంలో సహాయపడతాయి.

అంతేకాక నిమ్మరసంలో సిట్రిక్ ఆమ్లం మరియు విటమిన్ సి, పుష్కలంగా ఉండుట వలన చర్మ టోన్ కి సహాయకారిగా ఉంటుంది.అలాగే విటమిన్ సి చర్మానికి ఫ్రీ రాడికల్స్ ద్వారా జరిగే నష్టాన్ని తటస్థీకరిస్తుంది.

పద్దతి


* ఒక బౌల్ లో ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ దోసకాయ రసం,ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి.* ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ బాల్ సహాయంతో ప్రభావిత ప్రాంతంలో రాయాలి.

* పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి.* ఈ ప్యాక్ ని ప్రతి రోజు క్రమం తప్పకుండా వేస్తె చర్మం బిగుతుగా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube