Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

కళ్ళ కింద ఉబ్బు తగ్గటానికి సమర్ధవంతమైన ఇంటి నివారణలు-How To Get Rid Of Puffy Eyes Home Remedies

సాదారణంగా నిద్ర సరిగ్గా లేకపోతే కళ్ళ కింద ఉబ్బు వస్తుంది. కళ్ళ కింద చర్మం మరియు రక్త నాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. అయితే చికాకు, అలెర్జీలు, అతిసారం, ఒత్తిడి, వంశపారంపర్యం, హార్మోన్ల హెచ్చుతగ్గులు, కొన్ని రకాల మందులు వాడకం వంటి కారణాల వలన కంటి కింద ఉబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళ్ళ కింద ఉబ్బును తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.దోసకాయ

దోసకాయ ఉబ్బిన కళ్ళను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. దీనిలో అధిక నీటి కంటెంట్ మరియు ఆస్ట్రిజెంట్ గుణాలు ఉండుట వలన రక్త నాళాలను బిగుతుగా ఉంచటం మరియు కంటి కింద వాపును తగ్గించటంలో సహాయపడుతుంది. విశ్రాంతిగా కూర్చొని లేదా పడుకొని కళ్ళ మీద చల్లని నీటిలో ముంచిన దోసకాయ ముక్కను పెట్టుకొని పది నిమిషాల పాటు అలా ఉంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

2. చల్లని నీరు

చల్లని నీటి చికిత్స కంటి కింద ఉబ్బును తగ్గించటంలో సహాయపడుతుంది. చల్లని నీటిని ముఖంపై చల్లి శుభ్రం చేసుకొని అరగంట సేపు విశ్రాంతి తీసుకోవాలి. చల్లటి నీరు రక్త నాళాలను బిగుతుగా మార్చి ఉబ్బు తగ్గటంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియను రోజులో అనేక సార్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

Continue Reading
To Top