Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఇంట్లో బల్లి ఉండకూడదు అంటే చేయాల్సిన 8 పనులు-How To Get Rid Of Lizards At Home? Useful Tips

4) దొడ్డిదారులు మూసేయ్యండి

బల్లులు ఎక్కువగా దొడ్డిదారుల నుంచే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అంటే గోడల్లో ఉండే పగుళ్ళు, రంధ్రాలను ఎంచుకుంటాయన్నమాట. ఇలాంటి మార్గాల నుంచే ఎవరి కంట కనబడకుండా రావడం వీటికున్న అలవాటు. అలాంటి రహస్య ద్వారాలు మీ ఇంట్లో ఉంటే వెంటనే మూసేయ్యండి. డాక్టర్ ఫిక్స్ ఇట్ వాడతారో లేక ఇంకేదైనా వాడతారో, ఆ పగుళ్ళు, రంథ్రాలు మూసేయండి. కిటకిల్లో మెటల్ స్క్రీన్స్ వాడండి. వంటగదిలో కాని, బాత్ రూమ్ లో కాని పగుళ్ళు ఉన్న పైపులు ఏమైనా ఉన్నాయో లేదు గమనించి మూసేయండి.

5) చల్లదనం భరించలేవు :

ఇంతకుముందు చెప్పినట్లుగా బల్లి వేడిగా ఉన్న ప్రదేశంలో ఉండేందుకు ఇష్టపడుతుంది. అది వాతావరణంలో సడెన్ గా మార్పు జరిగితే తట్టుకోలేదు. కాబట్టి మీ ఇంట్లో వాతావరణం లేదా టెంపరేచర్ మారేలా చేయండి. ఏసి అన్ చేయండి, ఆ చలి భరించడం వాటి వల్ల కాదు. లేదంటే ఓ స్ప్రే బాటిల్ తీసుకోని, అందులో ఐస్ క్యూబ్స్ వేసి, అవి ఇలా కరుగుతుండగానే నీటిని బల్లులపై స్ప్రే చేయండి. దెబ్బకి పరుగు పెడతాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు.

Continue Reading
More Posts
To Top