మందు ఎక్కువై తలనొప్పి వేస్తే ఏం చేయాలి ?

ఓ మంచి బ్రాండు తాగుతున్నారు అనుకోండి, ఆరోజు మందుబాబుల హడావుడి మాములుగా ఉండదు.ఇక మళ్ళీ ఈ బ్రాండ్ ఎప్పుడు దొరుకుతుందో అనే కక్కుర్తితో ఎక్కువ తాగేస్తారు.

 How To Get Over With Hang Over Quickly ?-TeluguStop.com

ఫలితం ? తెల్లారి తలనొప్పి.దాన్ని ముద్దుగా హ్యాంగోవర్ అంటారు.

కొంతమంది మరీ టూ మచ్ గా తాగకపోయినా తలనొప్పి వేస్తుంది.కొందరి బాడి టైప్ అంతే.

మామూలు తలనొప్పికి, ఈ తలనొప్పికి చాలా తేడా ఉంటుంది.రెండిటి లక్షణాలు కూడా వేరే ఉంటాయి.

తలనొప్పితో పాటు, వాంతులు, అలసట, అలసట .ఇలా పలు లక్షణాలు కనబడతాయి.మరి ఈ హ్యాంగోవర్ తలనొప్పిని వదిలించుకునేది ఎలా ? ఏం చేయాలి ?

* మంచినీళ్ళు బాగా తాగండి :


ఈ హ్యాంగోవర్ రావడం వెనుక చిన్న సైన్స్ ఉంది.మందు బాగా తాగితే ఏమవుతుంది ? మూత్రం మంచుకువస్తుంది.దాంతో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తారు.దాంతో శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది.అంటే నీటి శాతం పడిపోతుంది.దాంతో తలనొప్పి పుడుతుంది.

అందుకే, తెల్లారి లేవగానే ముందుగా మంచినీళ్ళు తాగాలి.చెప్పాలంటే, రాత్రి మద్యం తాగినా, తాగకపోయినా, లేవగానే నీళ్ళు తాగాలి.

* కొబ్బరినీళ్ళు తాగండి :


రక్తంలో ఉండే అయిదు ఎలక్ట్రోలైట్స్ కొబ్బరినీళ్ళలో ఉంటాయి.కాబట్టి కొబ్బరినీళ్ళు చాలా త్వరగా మన శరీరాన్ని పూర్వస్థితిలోకి తీసుకువెళ్తాయి.

అంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ని వెంటనే రీస్టోర్ చేస్తాయి కొబ్బరినీళ్ళు.ఇందులో పొటాషియం పాళ్ళు కూడా ఎక్కువ.అలాగే డిహైడ్రెషన్ సమస్య కూడా దూరమైపోతుంది.

* మంచి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి :


ఉదయాన్నే ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం అవసరం.ఇక హ్యాంగోవర్ ఉన్నప్పుడు అయితే ఇది అత్యవసరం.సలాడ్స్ తీసుకోండి.గుడ్లు తినండి.ఇప్పుడు మినరల్స్ అండ్ ప్రోటీన్స్ అవసరం కదా.అలాగే ఎమినో ఆసిడ్స్ ఎక్కువ ఉండే ఆహారాలపై దృష్టి పెట్టండి.

* అల్లం పనిచేస్తుంది :


* అల్లం తలనొప్పిని తగ్గిస్తుంది.బ్లడ్ సర్కిలేషన్ పెంచి యాక్టివ్ గా చేస్తుంది.ఇది హ్యాంగోవర్ వలన వచ్చే వాంతి సెన్సేషన్ ని కూడా తగ్గిస్తుంది.అల్లం మాత్రమే కాకుండా, అల్లంతో పాటు పెప్పర్మేంట్ కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.

మిగితా చిట్కాలు :


– నిమ్మరసం తాగండి.టాక్సిన్స్ ని బయటకు తీసి రిలీఫ్ ని ఇస్తుంది

– పెరుగు తీసుకోండి.ఆల్కహాల్ ఎఫెక్ట్ తగ్గుతుంది

– హెర్బల్ టీ, అంటే గ్రీన్ టీ, లెమన్ టీ లాంటివి.

పైన చెప్పిన అల్లంతో కూడా టీ తయారుచేసుకోవచ్చు

– అల్లం,వెల్లుల్లి తో సూప్ తాయారుచేసుకొని తాగండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube