గవర్నమెంటు హాస్పిటల్ లో డాక్టరు అపాయింట్‌మెంట్ ఇంటి నుంచే ఎలా తీసుకోవాలి?

డిజిటల్ ఇండియా పేరుతో భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యకమాల గురించి మీరు చూస్తూనే ఉన్నారు.నోటు బ్యాన్ తో మొదలైన ఈ కార్యక్రమం, ఎన్నో రంగాలకు విస్తరించింది.

 How To Book Doctor’s Appointment In Government Hospital?-TeluguStop.com

దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోయాయి.మహానగరాల్లో లిక్విడ్ క్యాష్ తక్కువ, డిజిటల్ క్యాష్ ఎక్కువ వాడుతున్నారు.అందులో మన తెలంగాణ నెం.1 స్థానంలో ఉండటం గమనించదగ్గ విషయం.ఇక ఇదే డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా, గవర్నమెంటు హాస్పిటల్స్ లో ప్రజలు తన సమస్యని బట్టి డాక్టర్ అపాయింట్‌మెంట్ ముందే ఆన్ లైన్ ద్వారా తీసుకొచ్చే వెసులుబాటు తీసుకొచ్చారు.ఇకనుంచి మీరు గవర్నమెంటు హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ కోసం గంటలు గంటలు ఎదురుచూడాల్సిన అవసరం లేదు.

మరి అపాయింట్‌మెంట్ ఎలా తీసుకోవాలో చూడండి.

* మొదట ఈ లింక్ ఓపెన్ చేయండి.

https://ors.gov.in/copp/

* ఎలక్రానిక్స్ & ఇంఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ వారు హ్యాండిల్ చేస్తున్న ఈ “Online Registration System” అనే వెబ్ సైట్లోకి మీరు వెళ్ళాక, మీకు Book Appointment, Lab Reports, Blood Availability అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి

* ఇప్పుడు Book Appointment మీద క్లిక్ చేయండి.

మీరు మరో పేజిలోకి వెళ్తారు

* సైట్ మీ ఆధార్ నంబర్ అడుగుతుంది.ఎంటర్ చేయండి

* ఒకవేళ మీ ఆధార్ కి మొబైల్ నంబర్ లింక్ చేసినట్లయితే ఆ మొబైల్ One Time Password వస్తుంది.

లేదంటే మీరు వేరే నంబర్ రిజిస్టరు చేసుకోవచ్చు

* OTP నంబర్ ఎంటర్ చేసాక మీ వివరాలు మీ ఫోటోతో సహా ప్రత్యక్షమవుతాయి.ఒకవేళ మీ వివరాలు అన్ని సరిగా ఉంటే Proceed నొక్కండి

* ఇప్పుడు మీకు Select State, Select Hospital, Select Department అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.

మీరు ఈ మూడు వివరాలు తెలిపి కింద ఉన్న Proceed నొక్కండి

* ఆ తరువాత తేది సెలెక్ట్ చేసుకోని బుకింగ్ కన్ఫర్మ్ చేయండి.మీ అపాయింట్‌మెంట్ వివరాలు మెసెజ్ రూపంలో మీ మొబైల్ కి వస్తాయి.

లేదంటే తెర మీద ఉన్న బుకింగ్ కన్ఫర్మేషన్ ని ప్రింట్ తీసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube