హార్మోన్లను సమతుల్యం చేయటానికి నేచురల్ చిట్కాలు

మహిళలకు సహజ మార్గంలో హార్మోన్స్ సమతుల్యం అనేది చాలా కష్టమైన పని.అయితే హార్మోన్ల సంతులనం పొందటానికి అనేక కారకాలు ఉన్నాయి.

 How To Balance Hormones Naturally-TeluguStop.com

హార్మోన్ల సంతులనం కొనసాగించటానికి శరీరం యొక్క సామర్ధ్యాన్ని పెంచాలి.ఆహార అలవాట్లు అనేవి హార్మోన్ పనితీరులో ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తాయి.కాబట్టి అవి సహజంగా హార్మోన్ల సమతుల్యం కొరకు సహాయం చేస్తాయి.

1.డైటరీ ఫైబర్స్
డైటరీ ఫైబర్స్ పాత ఈస్ట్రోజెన్ ను వ్యవస్థ నుండి తొలగించడం ద్వారా హార్మోన్ల సంతులనం నిర్వహించడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.కాబట్టి, వీలైనంత తృణధాన్యాలు (వోట్స్, గోధుమ బియ్యం, చియా విత్తనాలు, సైలియం ఊక), తాజా పచ్చి పండ్లు మరియు కూరగాయలను తినడానికి ప్రయత్నించాలి.

2.కూరగాయలు
హార్మోన్ స్థాయిలను నియంత్రణ చేయటానికి ఫోటో న్యూ త్రియంట్స్ ఉన్న కూరగాయలను తీసుకోవాలి.బ్రాస్సికా కుటుంబానికి చెందిన కూరగాయలలో పీచు పదార్థము ఎక్కువగా ఉంటుంది.ప్రతి రోజు బ్రోకలీ, చైనీస్ క్యాబేజీ, టర్నిప్, బోక్ చోయ్, వాసబి వంటి కూరగాయలను రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి.

3.కొబ్బరి నూనె
హార్మోన్ల సమతుల్యం విషయానికి వస్తే కొబ్బరి నూనె అద్భుతమైన పరిష్కారం అని చెప్పవచ్చు.

సంతృప్త కొవ్వులు సమృద్దిగా ఉండుట వలన ఎండోక్రైన్ వ్యవస్థ స్రావాలను గణనీయంగా పెంచుతుంది.రోజువారీ ఆహారంలో పావు కప్పు కొబ్బరి నూనెను చేరిస్తే మంచి పలితం కనపడుతుంది.

4.సప్లిమెంట్స్
బిజీ జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవటం చాలా కష్టం అవుతుంది.

అందువల్ల పోషణ అవసరాలకు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ D, మెగ్నీషియం, కాల్షియం, కాడ్ లివర్ నూనె మొదలైన వాటిని సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube