ఉల్లిగడ్డలు కోసేటప్పుడు కన్నీరు రాకూడంటే ఈ చిట్కాలు పాటించండి

ఉల్లిగడ్డలని చాలా వంటకాల్లో వాడుకుంటాం మనం.కొడిగుడ్డు, చికెన్ లాంటి నాన్ వెజ్ వంటకాల్లో అయితే ఉల్లిగడ్డ ఉండాల్సిందే.

 How To Avoid Tears While Cutting Onions-TeluguStop.com

చివరికి మిజ్జిగలో కూడా వాడాల్సిందే.సో, దాన్ని కోయకుండా తప్పించుకోలేం.

మరి దాన్ని కోసేటప్పుడు కన్నీళ్ళు రాకుండా తప్పించుకోగలమా?

అసలు ఉల్లిగడ్డలు కట్ చేసేటప్పుడు కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఎందుకంటే మనం ఇలా కోయగానే ఉల్లిలోంచి Proponethiol S-oxide అనే గ్యాస్ వస్తుంది.ఇది ఉల్లిలో ఉండే ఎంజైమ్‌లతో కలిసి సల్ఫర్ గ్యాస్ వదులుతుంది.

అది కాస్త మన కంట్లోకి వెళ్ళగానే కన్నీళ్ళు వచ్చేస్తాయి.అలాంటప్పుడు కళ్ళను నమలకూడదు.

కొన్ని చిట్కాలు ఉన్నాయి.అవి పాటించండి.

* సన్ గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్, బ్లూ లైట్ గ్లాసెస్ .మీరు ఏది వాడితే అది తొడుక్కోని ఉల్లిగడ్డలు కోయండి.ఆ గ్యాస్ మీ కంట్లో పడదు.

* కోసే కత్తికి నిమ్మరసం రాయండి.అదే కత్తితో కోస్తే ఆ గ్యాస్ ప్రభావాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించవచ్చు.

* ఓ బౌల్ నిండా నీళ్ళు తీసుకోండి.

ఆ నీటిలో ఉల్లిని ముంచి, ఆ నీటిలోనే కట్ చేయండి.గ్యాస్ ప్రభావం తగ్గుతుంది.

* కోయడానికి ఓ పదిపదిహేను నిమిషాల ముందు ఉల్లిని డీఫ్రిడ్జ్ లో పెడితే కూడా గ్యాస్ ప్రభావాన్ని తగ్గించవచ్చు.కాని ఇది మంచి పద్ధతి కాదు.

ఉల్లిని ఫ్రిడ్జ్ లో పెట్టడం అంటే దాన్ని పాడుచేయటమే.కాని చాలాబాగా పనిచేసే ట్రిక్ ఇది.

* నోటితో గాలి పీల్చుకుంటూ కట్ చేయడం వలన కొంత గ్యాసుని దారి మళ్ళించవచ్చు అని చెబుతారు.ఓసారి ప్రయత్నించండి.

* ఉల్లిని కాసేలు వెనిగర్ లేదా ఉప్పు నీటిలో ఉంచి, ఆ తరువాత కోయడం ద్వారా కూడా గ్యాస్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

* బుబుల్ గమ్ లేదా బ్రెడ్ నములుతూ కోస్తే కూడా గ్యాస్ ప్రభావం తగ్గుతుందని ఓ ట్రిక్ ప్రచారంలో ఉంది.

కాని ఎంతవరకు పనిచేస్తుందో గ్యారంటి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube