మొబైల్ నుంచి ఆ రకంగా కూడా శరీరాన్ని కాపాడుకోవాలి

మొబైల్ వలన మనకొచ్చే నష్టాలు ఏమున్నాయి అంటే అందరు రేడియేషన్ అంటారు లేదా స్క్రీన్ లైట్ వలన కంటికి ఇబ్బంది అని అంటారు.కాని ఎక్కువగా గమనించని ప్రమాదం కూడా ఉంది.

 Ever Thought How Important It Is To Clean Your Phone Regularly ?-TeluguStop.com

అదే అపరిశుభ్రత.మన చేతులు అక్కడిక్కడ పెడితే, వాటికి దుమ్ము, బ్యాక్టీరియా అంటుకుంటుందని తెలిసి చేతులు కడుక్కుంటాం.

కాని మొబైల్ ని అక్కడిక్కడ పెట్టి, ఆ మొబైల్ ని రోజంతా చేతిలో పట్టుకొని, అసలు మన చేతికి ఏమి అంటనట్టుగా అలసత్వం ప్రదర్శిస్తాం.నిజానికి ఒక్కోసారి పాదరక్షలకి ఏమాత్రం తగ్గని దుమ్ముధూళి మన మొబైల్ ఫోన్స్ మోసుకోస్తాయి.

ఆ మొబైల్ ని చెవిలో పెట్టుకుంటాం, చేతిలో పట్టుకుంటాం, జేబులో దాచుకుంటాం, మళ్ళీ దాన్ని శుభ్రం చేయకుండానే వాడేస్తుంటాం.ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి.

మన మొబైల్ ఫోన్ ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.అప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం.

మొబైల్స్ ని శుభ్రం చేసుకునేందుకు మార్కెట్లో చాలా క్లీనేసర్స్ దొరుకుతున్నాయి.UV Sanitizer అనే డివైజ్ కూడా అందుబాటులోకి వచ్చింది.

ఆపిల్ సైడేడ్ వెనిగర్ తో కూడా మన ఫోన్ ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.అయితే, కీన్ చేయడానికి ఏ లిక్విడ్ వాడినా, కాటన్ తో తుడవడమే ఉత్తమం.

కేవలం మొబైల్ మాత్రమె కాదు, మన ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube