బీర్ తో మీ అందాన్ని ఎలా పెంచుకోవాలంటే

ఒక లిమిట్ లో తీసుకుంటే బీర్ శరీరానికి ఎంత మేలు చేస్తుందో మనకి తెలిసిందే.అయితే బీర్ కేవలం మన శరీరం లోపటి భాగాలపై మాత్రమే కాదు, చర్మంపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది.

 How Can You Use Beer For Skin And Hair Health ?-TeluguStop.com

కురుల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.అయితే దాని ఎలా వాడాలో అలానే వాడాలి.

బీర్ తాగడం కాదు, బీరుతో కొన్ని మిశ్రమాలు తయారుచేసుకోని మన అందాన్ని పెంచుకోవాలి.మరి బీర్ ని మన బ్యూటి కోసం ఎలా వాడాలో చూడండి.

* ఇది వేసవి.ఇలాంటి హై టెంపరేచర్ కాలంలో స్కిన్ ట్యాన్ అనేది చాలా సాధారణ విషయం.

ముఖం రంగు మారిపోతుంది.ఇలాంటప్పుడు నిమ్మరసం, ఆల్మండ్ ఆయిల్ లో బీర్ మిక్స్ చేయండి.

ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోండి.కాసేపు ఉంచి కడుక్కోండి.

ఇలా రెగ్యులర్ గా చేస్తే ఎండనుంచి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు.ట్యాన్ వచ్చినా సరే, ఈ మిశ్రమం మీకు సహాయపడుతుంది.

* నమ్మడానికి కష్టంగా అనిపించవచ్చు కాని, బీరులో యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ బి ఉంటాయి.ఈ ఎలిమెంట్స్ డల్ గా ఉన్న చర్మంపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి.

కోడిగుడ్డులోని వైట్ ని తీసుకొని, బీరుతో పాటు ఆల్మండ్ ఆయిల్ కలపండి.ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోండి.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉండండి.కొన్ని రోజుల్లోనే మెరిసే ముఖం మీ సొంతమవుతుంది.

* బీర్ మీ చర్మాన్ని ఎక్స్ఫోలిఎట్ చేస్తుంది.నల్ల మచ్చలు, మూతబడిన రంధ్రాలను ట్రీట్ చేస్తూ, కొత్త సేల్స్ ఎదిగేలా చేస్తుంది.

స్ట్రాబెరిని గ్రైండ్ చేసి, అందులో బీర్ కలపండి.దీన్ని ఫేస్ మాస్క్ లా రెగ్యులర్ గా పెట్టుకోండి.

మీ చర్మం కొద్దిరోజుల్లోనే ఆరోగ్యంగా కనిపిస్తుంది.

* అందం అంటే కేవలం చర్మం మాత్రమే కాదు కదా.కురులు కూడా మన అందాన్ని పెంచుతాయి.కాబట్టి కురులు బలంగా, కాంతివంతంగా ఉండాలి.

బీర్ మీ కురుల ఆరోగ్యాన్ని పెంచుతుంది తెలుసా ? ఎప్పుడు బీర్ షాంపు గురించి వినలేదా ? ఖర్చు ఎక్కువ అనిపిస్తే నిమ్మరసంలో బీరు కలుపుకొని కురులకి పట్టండి.కురులు కాంతివంతంగా మారతాయి.

* కురులు దువ్వడానికి స్మూత్ గా లేకపోయినా, మీరు చెప్పిన మాట వినకపోయినా, కురులను బీర్ ఉపయోగించి స్ట్రెయిట్ గా మార్చుకోవచ్చు.ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్స్, ఎంజీమ్స్ మీకోసం ఆ పని చేసి పెడతాయి.

మీరు చేయాల్సిందల్లా నీటిలో బీరు కలిపి, దాన్ని వెంట్రుకలకి పట్టడమే.కాసేపు ఉంచి, కడిగేసుకొని, ఆ తరువాత దువ్వుకోండి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube