Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

బీర్ తాగడం వలన పొట్ట వస్తుందా ?-How Beer Makes One Fat?

మనం గమనిస్తూ ఉంటాం .. స్నేహితుల్లో ఎవరైనా కొంచెం లావెక్కినా, పొట్ట పెంచినా “వీరు బీరు ఎక్కువ తాగుతున్నాడు” అంటూ కామెంట్ చేస్తారు. ఎవరైనా సన్నగా ఉంటే బీరు తాగమని సలహా ఇస్తారు. మరి బీరు నిజంగానే మనిషిని లావు చేస్తుందా ? పొట్ట తీసుకోస్తుందా ? ఇది ఎంతవరకు నిజం ?

నిజానికి బీరులో కొవ్వు ఉండదు. అవును బీరులో అసలు ఫ్యాట్స్ ఉండవు. మరి కొవ్వు లేనప్పుడు బీరు వలన లావు ఎలా ఎక్కుతారు, అదంతా రూమర్ అనే అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు. బీర్ మీ ఒంట్లోకి కొవ్వులని పంపించి డైరెక్ట్ గా లావు చేయకపోవచ్చు, కాని మీరు లావు ఎక్కేలా చేస్తుంది. ఎలాగో చూడండి.

బీరులో ఫ్యాట్స్ ఉండవు, కాని కాలరీలు బాగానే ఉంటాయి. కాలరీలు మన శరీరానికి అనవసరం కాదు, అవసరమే. కాని కాలరీలు ఖర్చు అవ్వాలి. లేదంటే మన ఒంట్లోకి సరిపడా కాలరీలు మాత్రమే వెళ్ళాలి. రెండిట్లో ఏది జరక్కపోయినా, ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది. అప్పుడే మనిషి లావు అవుతాడు, పొట్ట పెంచేస్తాడు. బీరు మెటబాలిజం రేటు పడిపోయేలా చేస్తుంది (అధికంగా తాగితే). దాంతో కాలరీలు కొవ్వులాగా ఒంట్లోనే ఉండిపోతాయి.

బీరు ఒక్కటనే కాదు, ఎలాంటి మద్యం తాగినా ఇదే పరిస్థితి. మద్యం తాగినప్పుడు మన లివర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అది ఫ్యాట్స్ తో పాటు మద్యాన్ని మెటబాలైజ్ చేసేందుకు తీవ్రశ్రమ పడి, ఫ్యాట్స్ మొత్తాన్ని కరిగించలేదు. దాంతో కొవ్వు పెరుగుతుంది.

ఎవరైనా బరువు ఎందుకు పెరుగుతారు ? కొవ్వు ఎందుకు పెరుగుతుంది? అవసరానికి మించి కాలరీలు తీసుకోని వాటిని కరిగించలేకపోతేనే కదా! సగటు బీరులో 146 కాలరీలు ఉంటాయి. కొన్ని బీరుల్లో ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ని కాలరీలు ఉన్న బీరు ఒక్కటి తాగి సరిపెట్టుకోరు, ఆల్కాహాల్ శాతం తక్కువ కాబట్టి రెండు మూడు బాటిల్స్ లాగించేస్తారు మందుబాబులు. మరి బీరు తాగిన తరువాత. చేసే పని ఏంటి ? పడుకోవడమే కదా. అన్ని కాలరీలు తీసుకోని నిద్రపోతే అవి ఎక్కడ ఖర్చు అవుతాయి? ఇక కొవ్వు ఎందుకు పెరగదు?

Continue Reading
More Posts
To Top