ఒంటరిగా...చీకటిలో...ఆటోలో

‘మేరా మహాన్‌ భారత్‌’ అని పొగుడుకునే ఇండియా అత్యాచారాలకు (రేప్‌లకు) నిలయమైపోయింది.కారులో, బస్సులో, రైల్లో, ఒంటిరిగా, జనం మధ్య…ఇలా ఎక్కడబడితే అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.

 How An Ola Auto Driver Became A Hero?-TeluguStop.com

ఇండియా అత్యాచారాలకు పర్యాయపదంగా మారిపోయిన నేపథ్యంలో ఓ యువతి చీకటి రాత్రి, ఆటోలో ఒంటరిగా ముప్పయ్‌ ఎనిమిది కిలోమీటర్ల దూరం క్షేమంగా ప్రయాణం చేయడం విశేషమే కదా….! ‘మహిళ అర్థరాత్రి ఒంటరిగా తిరగగలిగినప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు’ అన్నారు మహాత్మా గాంధీ.

ఆ మాటలను నిజం చేసి హీరో అయ్యాడు ఘసంఫర్‌ ఆలీ కె.ఈయన బెంగళూరులో ఓలా ఆటో డ్రైవర్‌.రంజనీ శంకర్‌ అనే యువతి ఈయన ఆటోలో ఒంటరిగా రాత్రి వేళ బెంగళూరు నుంచి కనకపురా వరకు ప్ర యాణం చేసింది.ఈ దూరం ముప్పయ్‌ ఎనిమిది కిలోమీటర్లు.

ఈమె అంత దూరం క్షేమంగా వెళ్లిందంటే కారణం…ఆటో డ్రైవర్‌ ఈమె బంధువు కాదు.పరిచయస్తుడు కాదు.

ముక్కు మొహం తెలియనివాడు.అతని మంచితనమే ఆ యువతిని క్షేమంగా గమ్యం చేర్చింది.

ప్రస్తుతం యువతులు, మహిళలు, బాలికలు ఒంటరిగా ప్రయాణించి క్షేమంగా గమ్యం చేరడం పెద్ద విశేషంగా చెప్పుకోల్సిన పరిస్థితి ఏర్పడింది.రంజనీకి కూడా ఇదే అనిపించింది.వెంటనే ఆమె తన క్షేమ ప్రయాణం గురించి, ఆటో డ్రైవర్‌ మంచితనం గురించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.ఇంకేముంది….! ఇదో గొప్ప వార్తగా మారిపోయి ఓలా ఆటో డ్రయివర్‌ ఘసంఫర్‌ ఆలీ కె.ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.బెంగళూరు నుంచి కనకపుర వెళ్లేందుకు ఎంతసేపూ ఎదురుచూసినా రంజనీ శంకర్‌కు వాహనం దొరకలేదు.కాని వెళ్లితీరాలి.చివరకు ఓలా ఆటో కనబడింది.అది మాట్లాడుకొని బయలుదేరింది.

చిమ్మచీకట్లో ఆటో వెళ్లిందని, తన దగ్గర సెల్‌ఫోన్‌ వెలుగు మినహా మరేమీ లేదని రంజనీ తెలిపింది.తాను ఒంటరిగా ఉనప్పటికీ ఆటో డ్రైవర్‌ హుందాగా, మంచితనంగా వ్యవహరించాడని పేర్కొంది.

అతన్ని చూసి గర్వపడుతున్నానని ప్రశంసించింది.ఫేస్‌ బుక్‌లోని రంజనీ శంకర్‌ పోస్టుకు పదకొండువేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

కొందరిలోనైనా మంచితనం ఉండబట్టే ఇంకా ఈ ప్రపంచం మిగిలివుందేమోననిపిస్తోంది కదూ….!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube