మహేష్,ఎన్టీఆర్ చేస్తా అన్నారు కాని

మీకు గుర్తుందో లేదో .రుద్రమదేవిలోని గోనగన్నారెడ్డి పాత్ర మొదట సూపర్ స్టార్ మహేష్ చేస్తారు అనే వార్తలు వచ్చాయి .

 How Allu Arjun Replaced Mahesh And Ntr In Rudramadevi-TeluguStop.com

కారణాలు ఏవైనా, మహేష్ ఆ పాత్ర చేయలేదు.ఆ తరువాత ఎన్టీఆర్ అన్నారు, చివరకు అల్లు అర్జున్ ఆ పాత్ర చేసారు .ఇంతకీ మహేష్,ఎన్టీఆర్ కాకుండా అల్లు అర్జున్ ఈ పాత్ర ఎందుకు చేయాల్సివచ్చిందో తెలుసుకోవాలంటే గుణశేఖర్ ఏం చెప్పారో చదవండి.

“ఈ సినిమా కథ మహేశ్‌కు కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు.ఒక్కడు సమయం నుంచి తనతో ఈ చిత్రం గురించి చర్చించేవాడిని.గోన గన్నారెడ్డి కేరక్టర్‌ను తానూ చేస్తానన్న ఆసక్తి చూపించేడు.కానీ తనకు వీలు దొరకలేదు.అలాగే ఎన్టీఆర్‌ కూడా ఇంటరెస్ట్‌ చూపించాడు.

అతనికీ వీలవలేదు.అల్లు అర్జున్‌ బేసిగ్గా మూవీ లవర్‌.

‘ఓ గొప్ప హిస్టారికల్‌ మూవీ తీస్తున్నారు.నన్నెలా వాడుకుంటారో వాడుకోండి’ అని తనంతట తానుగా అన్నాడు.

గోనగన్నారెడ్డి క్యారెక్టర్ కి నేను సరిపోతానంటే ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలోనే ఉన్నా.ఫోన్‌ కొడితే వచ్చి చేస్తా’ అన్నాడు.

దాంతో అతని బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యేలాగా ఆ కేరక్టర్‌ను అడాప్ట్‌ చేసుకొని, అతనితో చేయించాను.స్టార్‌ హీరోగా తనకు పరిమితులు ఉన్నప్పటికీ, హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలో వాటిని పక్కనపెట్టి స్పెషల్‌ అప్పీరెన్స్‌గా చేశాడు.అతని పాత్ర సినిమాలో సుమారు 50 నిమిషాలు ఉంటుంది.” అంటూ ముగించారు గుణశేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube