‘హోరా హోరీ’ వాయిదా పడనుందా?

తేజ దర్శకత్వంలో అంతా కొత్త వారితో తెరకెక్కిన ‘హోరా హోరీ’ మూవీ కోసం యూత్‌ ఆడియన్స్‌ ఎదురు చూస్తున్నారు.‘జయం’, ‘నువ్వు నేను’ వంటి పలు యూత్‌ ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తేజ ఎంతో నమ్మకం పెట్టుకుని తెరకెక్కించిన చిత్రం ‘హోరా హోరీ’.

 Hora Hori Movie Maybe Postponed-TeluguStop.com

ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదల అయ్యింది.తాజాగా ఈ సినిమాను తేజ ఆగస్టు 14న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

అందుకు ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.

సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ఎదురు చూస్తున్న ‘హోరా హోరీ’ సినిమాకు అనుకోని షాక్‌ తగిలింది.

నిన్న విడుదలైన ‘శ్రీమంతుడు’ సినిమా వల్ల ‘హోరా హోరీ’ విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్‌ను తెచ్చుకుంది.

దాంతో ఈ వారంతో పాటు వచ్చే వారంలో కూడా బాక్సాఫీస్‌ వద్ద ‘శ్రీమంతుడు’ సందడి కొనసాగే అవకాశాలున్నాయి.దాంతో ‘హోరా హోరీ’ విడుదల అయితే కష్టమే అంటున్నారు.

దాంతో తేజ ఆలోచనల్లో పడ్డాడు.అయితే ఆగస్టు 21న కిక్‌ వచ్చేందుకు సిద్దంగా ఉంది.

ఆ తర్వాత ‘రుద్రమదేవి’ సినిమా ఇప్పటికే సిద్దం అయ్యింది.దాంతో తేజ ‘హోరా హోరీ’ ఎప్పుడు విడుదల చేయాలా అనే ఆలోచనలో పడ్డట్లుగా తొస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube