ఈగలను వదిలించుకోవటానికి ఇంటి చిట్కాలు

రెండు రెక్కలు కలిగిన కీటకాలు ప్రపంచంలో 1.20 మిలియన్ కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి.ఈగను శాస్త్రీయంగా ‘ముస్కా డొమెస్టిక్’ అని పిలుస్తారు.ఈగల కారణంగా కలరా, విరేచనాలు, టైఫాయిడ్ మరియు అతిసారం వంటి వ్యాధులు వస్తాయి.అంతేకాక వాటిని వ్యాప్తి కూడా చేస్తాయి.అలాగే తీవ్రమైన కంటి వ్యాధులు కూడా వస్తాయి.ఇప్పుడు ఈగలను వదిలించుకోవటానికి ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.

 Home Remedies To Get Rid Of Flies-TeluguStop.com

1.కర్పూరం :

ఈగలను వదిలించుకోవటానికి ఇది గొప్ప పరిష్కారం.ఈగలు ఉన్నగదిలో కర్పూరంను వెలిగిస్తే ఆ పొగకు వెంటనే ఈగలు బయటకు పోతాయి.

2.తులసి చెట్టు:

తులసిలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి.ఇది ఈగలను తరిమికొట్టటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.కేవలం తులసి చెట్టును పెరటిలో పెంచుకుంటే సరిపోతుంది.

3.ప్లాస్టిక్ వాటర్ సంచులు:

ప్లాస్టిక్ వాటర్ సంచులను ఇంటిలో వ్రేలాడదీస్తే ఈగలు రాకుండా ఉంటాయి.

4.దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క వాసన ఈగలకు చాలా ద్వేషం.అందువల్ల ఈగలు ఉండే ప్రదేశంలో దాల్చిన చెక్కను పెడితే ఈగలు పోతాయి.

5.తెల్ల వైన్:

ఒక బౌల్ లో డిటర్జెంట్ డిష్ వాష్ మరియు తెల్ల వైన్ వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ఈగలు ఉన్న ప్రదేశంలో పెడితే, ఆ మిశ్రమానికి ఆకర్షితమైచనిపోతాయి.

6.కారం పొడి:

ఒక స్ప్రే సీసా లో కారం పొడి మరియు నీటిని పోసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ఇంటి చుట్టూ స్ప్రే చేస్తే ఈగలు చనిపోతాయి.

7.ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది ఈగలను వదిలించుకోవటానికి మరో సమర్ధవంతమైన మార్గం.ఒక బౌల్ లో ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు ద్రవ డిటర్జెంట్ వేసి బాగా కలిపి ఈగలు ఉన్న ప్రదేశంలో పెడితే, ఈ ద్రావణానికి ఆకర్షితమై ఈగలు చనిపోతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube