ముడతలకు చెక్ పెట్టాలంటే....ఇంటి చిట్కాలు

వృద్ధాప్య ఛాయలకు సంకేతం ముడతలు.ఇటువంటి ముడతలను చిన్న చిన్న చిట్కాలతో ప్రారంభ సమయంలోనే తగ్గించుకోవచ్చు.

 Home Remedies For Wrinkles-TeluguStop.com

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరినూనె ఇది దాదాపుగా అందరికి అందుబాటులో ఉంటుంది.

ఇది చర్మాన్ని మృదువుగా ఉంచటమే కాకుండా ముడతలను కూడా తగ్గిస్తుంది.దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముడతలకు కారణం అయినా ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తాయి.

రాత్రి పడుకొనే ముందు ముఖానికి కొబ్బరి నూనె రాసుకొని మర్దన చేసుకుంటే సరిపోతుంది.

కలబంద కలబంద జెల్ ని ముఖానికి రాసుకొని ఆరిపోయాక కడిగితే సరిపోతుంది.

ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

అరటిపండు అరటిపండును మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికి రాసుకొని 15 నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

అరటిపండులో సమృద్ధిగా ఉండే పొటాషియం,బి,సి విటమిన్స్ చర్మానికి మంచి పోషణను అందిస్తాయి.

తెల్లసొన గుడ్డు తెల్లసొనను ముఖానికి రాసుకొని ఆరాక శుభ్రం చేసుకోవాలి.

తెల్లసొనలో ఉండే పోషకాలు చర్మానికి అవసరమైన తేమను అందించటమే కాక చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube