ఈ చిట్కాతో..చిగుళ్ళ వాపు..నొప్పి తగ్గిపోతుంది

మనిషి శరీరానికి ఆరోగ్యం చాలా ముఖ్యం.అసలు చాలా రోగాలు మనిషికి నోటిద్వారానే వ్యాపిస్తాయి.

 Home Remedies For Teeth And Gums..infections-TeluguStop.com

నోటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎంటువంటి సమస్యలు రావు అని చెప్తున్నారు వైద్యులు.అంతేకాదు నోటిలో అల్సర్లు.

చిగుళ్ళకి పుండ్లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలట.

మనలో చాలా మంది పళ్ళని తోముకునే టప్పుడు బ్రష్ తో చాలా వేగంగా తోమడం.

అటు ఇటు తిప్పుతూ అనేకరకాలుగా పళ్ళని తోమేస్తుంటారు.ఇలా చేయడం వలన చిగుళ్ళు దెబ్బ తింటాయి.

అంతేకాదు వాపు వచ్చి మనం ఏమితిన్నా సరే నొప్పికలుగుతాయి.చివరికి మంచి నీళ్ళు ఆవాపు ప్రదేశంలో తాకినా భాదకలుగుతుంది.

మనం వాటిని పట్టించుకోకపోతే.అవి చివరికి పుండ్లుగా మారి దంతాల మీద ప్రభావాన్ని చూపుతాయి.

చిగుళ్లు వాచి, నొప్పి పెడుతుంటే చిన్న చిన్న చిట్కాల ద్వారా నయం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు .అలాంటి వాటిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఎలా అంటే

గ్లాసు నీళ్లలో పుదీనా ఆకుల్ని 30 నిమిషాలు నానబెట్టి ఆ నీటితో తరచుగా నోరు పుక్కిలిస్తూ ఉండాలి.లవంగ నూనెను వేలితో తీసుకుని చిగుళ్లకు రుద్దాలి.ఇలా చేస్తే చాలా మార్పు కలుగుతుంది.నెప్పులు తొందరగా తగ్గుతాయి అని చెప్తున్నారు.అంతేకాదు దంతాలు శుభ్రపడి, చిగుళ్లకు రక్తప్రవాహం చక్కగా జరగాలంటే రోజుకో పచ్చి కూరగాయ నమిలి తినాలి.

ఆవ నూనెలో చిటికెడు ఉప్పు కలిపి దంతాలు, చిగుళ్లు రుద్దాలి.నీళ్లు, హైడ్రోజన్‌ పెరాక్పైడ్‌ సమపాళ్లలో తీసుకుని, కలిపి, నోరు పుక్కిలించాలి.

గానుగ పుల్లతో రోజు తోముకుంటే వాటినుంచీ వచ్చే నునేలాంటి పదార్ధం చిగుల్లకి మరింత బలాన్ని ఇస్తుంది.గానుగ బెరడుని తీసి నేను వచ్చేంతవరకు నమిలి పుక్కిలించాలి.

ఇలా చేయడం వాళ్ళ దంతాలు మరింత దృడంగా ఉంటాయి.నోట్లో ఉండే ఇన్ఫెక్షన్లు పోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube