Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మందులు అవసరం లేకుండా ఇంటి నివారణలతో బిపిని తగ్గిచుకోవచ్చా....ఎలా?-Home Remedies For High Blood Pressure

బిపిని తగ్గించటంలో నీరు కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. నీరు ఎక్కువగా త్రాగితే శరీరంలో ఎక్కువగా ఉన్న సోడియం కంటెంట్ బయటకు పోతుంది. దాంతో బీపీ తగ్గుతుంది.

అరటిపండులో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన బిపిని తగ్గించటంలో సహాయపడుతుంది. అంతేకాక పొటాషియం కిడ్నీల పనితీరులో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అరటిపండును ప్రతి రోజు ఆహారంలో బాగంగా చేసుకుంటే బిపిని సులభంగా తగ్గించుకోవచ్చు.

బిపికి కారణం అయిన ఉప్పును తగ్గించాలి. అంటే ప్రొసెస్ చేసిన ఆహారాలు,జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది.

డార్క్ చాక్లెట్ లో ఫ్లెవనాల్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి బిపిని తగ్గించటంలో బాగా సహాయపడతాయి. అలాగే కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ ను దూరం చేయటంలో సహాయపడుతుంది.

Continue Reading
More Posts
To Top