పాదాల దుర్వాసన పోవాలంటే....నివారణ చిట్కాలు

కొన్ని సార్లు పాదాల దుర్వాసనతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం.కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు.

 Home Remedies For Foot Odor-TeluguStop.com

ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నా సబ్బు లేదా బేకింగ్ సోడా తో పాదాలను తరచుగా కడుక్కోవాలి.

స్నానం చేసిన తర్వాత పాదాలను తడి పోయేలా శుభ్రంగా పొడి బట్టతో తుడవాలి.

బూట్లు వేసుకోవటం తప్పనిసరి అయినప్పుడు ముందు రోజు బూట్లలో కొద్దిగా వంటసోడా చల్లాలి.

అది బ్యాక్టీరియాను నశింపచేసి దుర్వాసనను తగ్గిస్తుంది.రోజు విడిచి రోజు ఈ విధంగా చేస్తే దుర్వాసన తగ్గిపోతుంది.

యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అరోమా నూనెలతో ఎక్కువగా ఉంటాయి.సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా ఒక అరోమా నూనెను తీసుకోని పాదాలకు రాసి మసాజ్ చేయాలి.

లేకపోతే ఆ నూనెను ఒక కాగితంపై వేసి బూట్లలో రాత్రంతా ఉంచితే సరిపోతుంది.

సమస్య నుండి పూర్తిగా బయట పడాలంటే అర టబ్ గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి అందులో పాదాలను పెట్టి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి.

అర టబ్ గోరువెచ్చని నీటిలో గుప్పెడు ఉప్పు వేసి అందులో పాదాలను పదిహేను నిమిషాల పాటు ఉంచాలి.

ఈ చిట్కాలను ఫాలో అయ్యితే సులభంగా పాదాల దుర్వాసన నుండి బయట పడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube