చెవి ఇన్ఫెక్షన్ కోసం సులభమైన ఇంటి నివారణలు

చెవి ఇన్ఫెక్షన్, నొప్పి మరియు ఇతర లక్షణాలను వదిలించుకోవటానికి సాధారణ మరియు సులభమైన ఇంటి నివారణలు ఉన్నాయి.

 Home-remedies-for-ear-infections, Health Tips , Health ,godd Health, Health Beni-TeluguStop.com

1.ఉప్పు

ఉప్పు అనేది ఎక్కువగా అందుబాటులో ఉండే ఇంటి నివారిణి.ఒక కప్పు ఉప్పును పాన్ లో వేసి తక్కువ మంట మీద కొన్ని నిముషాలు వేడ చేయాలి.

లేకపోతే మైక్రోవేవ్ లేదా డబుల్ బాయిలర్ లో వేడి చేయవచ్చు.ఒక వస్త్రం మీద వేడి చేసిన ఉప్పును వేసి ప్రారంభం మరియు ముగింపునరబ్బరు బ్యాండ్ లేదా దారం సాయంతో ముడి వేయాలిఈ వస్త్రాన్ని ప్రభావిత ప్రాంతంలో పది నిముషాలు ఉంచాలి.
ప్రతి రోజు ఎన్ని సార్లు అయినా చేయవచ్చు.ఉప్పు నుండి ఉత్పన్నమైన వేడ కారణంగా చెవి నుండి ద్రవం బయటకు రాకుండా ఉండటం మరియు వాపు, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

2.వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు మరియు సహజ నొప్పి ఉపశమ లక్షణాలు ఉండుట వలన చెవి ఇన్ఫెక్షన్ చికిత్సలో అత్యంత ప్రభావవంతముగ పనిచేస్తుంది.ఈ వెల్లుల్లిని ఇంటి చికిత్సలో ఉపయోగించడానికి కొన్నిమార్గాలు ఉన్నాయి.
రెండు స్పూన్ల నువ్వుల నూనె లేదా ఆవ నూనెలో రెండు వెల్లుల్లి రెబ్బలన వేసి నల్లగా అయ్యేవరకు వేగించి, ఆ నూనెను వడకట్టి, కొంచెం వేడిగఉన్నప్పుడు 4 నుంచి 6 చుక్కల నూనెను చెవిలో వేసుకోవాలి.
దీనికి ప్రత్యామ్నాయంగా, నీటిలో రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి ఐదు నిముషాలు మరిగించాలి.వెల్లుల్లిని మెత్తగా చేసి ఉప్పు కలపాలి.మిశ్రమాన్ని ఒక శుభ్రమైన వస్త్రంలో వేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టాలి.
ప్రతి రోజు రెండు లేదా మూడు పచ్చి వెల్లుల్లిని తింటే నయం చేసే ప్రక్రియను వేగవంతం చేయటానికి సహాయపడుతుంది.

Telugu Apple Veniger, Basil, Cocount Oil, Ear, Garlic, Godd, Benifits, Tips, Rem

3.తులసి

చిన్న చెవినొప్పి మరియు చెవి ఇన్ఫెక్షన్ చికిత్సలో పవిత్రమైన తులసినిఉపయోగించవచ్చు.ఇది చెవి నొప్పి నుంచి ఉపశమనం మరియు ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.తాజా తులసి ఆకులను తీసుకోని రసం తీయాలి.ఈ రసాన్ని నొప్పి ఉన్నప్రాంతంలో చెవి చుట్టూ రాయాలి.అంతేకాని చెవిలో ఈ రసాన్ని పోయకూడదు.

కొబ్బరి నూనె, తులసి నూనెను సమాన మొత్తంలో తీసుకోని కలపాలి.మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి చెవి లోపల, చెవి వెలుపలి అంచు చుట్టూ, చెవివెనక నిదానంగా తుడవాలి.

ఈ విధంగా ప్రతి రోజు రెండు సార్లు చేయాలి.

Telugu Apple Veniger, Basil, Cocount Oil, Ear, Garlic, Godd, Benifits, Tips, Rem

4.ఆపిల్ సైడర్ వినెగర్

చెవి ఇన్ఫెక్షన్ కలిగించే ఫంగస్ ని వదిలించుకోవటానికి ఆపిల్ సైడర్ వినెగర్ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.< నీరు లేదా ఆల్కహాల్, ఆపిల్ సైడర్ వినెగర్ లను సమాన మొత్తంలో తీసుకోని కలపాలి.

ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ని ముంచాలి.
ఈ కాటన్ బాల్ ని చెవిలో ఉంచి ఐదు నిముషాలు అలా వదిలేయాలి.

చెవి నుంచి కాటన్ బాల్ ని తీసేసి చెవిని హెయిర్ డ్రైయర్ సాయంతో పొడిగా తుడవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube