పొడిగా,నిర్జీవంగా మారిన జుట్టుకు చిట్కాలు

జుట్టు పొడిగా మారితే నిర్జీవంగా మారటమే కాకుండా జుట్టు చివర్లు చిట్లుతాయి.ఈ సమస్యల నుండి బయట పడాలంటే జుట్టు సరైన పోషణ అవసరం.

 Home Remedies For Dry Hair-TeluguStop.com

ఆ పోషణ కోసం మనం కొంచెం శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది.ఇప్పుడు ఆ పోషణ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక కప్పు కొబ్బరి పాలలో మూడు స్పూన్స్ శనగపిండి వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని జుట్టుకు,మాడుకు బాగా పట్టించాలి.పావుగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

బాదం నూనె,కొబ్బరి నూనె సమభాగాల్లో తీసుకోని దానిలో ఒక స్పూన్ ఆముదం కలిపి గోరువెచ్చగా చేయాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టుకు,మాడుకు పట్టించి 5 నిముషాలు మసాజ్ చేయాలి.ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

రెండు కప్పుల వేడి నీటిలో ఒక స్పూన్ తేనే వేసి జుట్టును కడగాలి.ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

అవకాడోలో ఉండే పోషకాలు జుట్టుకు పోషణను అందిస్తాయి.అవకాడో గుజ్జులో కొబ్బరిపాలను కలిపి జుట్టుకు పట్టించి పావుగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

గుమ్మడిపండు గుజ్జుకు ఒక స్పూన్ తేనే కలిపి తలకు పట్టించి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.ఈ విధంగా రెగ్యులర్ గా చేస్తూ ఉంటె జుట్టు మృదువుగా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube