ఆస్ట్రేలియాలో హిందుమతం పెరిగిపోతోంది .. ఎలా అంటే !

అతిప్రాచీనమైన మతంగా హిందు మతానికి (సనాతన ధర్మం) పేరుంది.ఇది ఎప్పుడు ఎక్కడ మొదలైందో, ఈనాటి చరిత్రకారులు కూడా చెప్పలేకపోతారు.

 Hinduism Is Second Fastest Growing Religion In Australia – Study-TeluguStop.com

అంతటి ప్రాచీనమైన సనాతన ధర్మం .ఆ తరువాత హిందు ఇజంగా మారి, మార్పులకి, చేర్పులకి గురయ్యి, ఇంకా వేల కారణాల వలన ఈరోజు ప్రపంచంలో మూడోవ అతిపెద్ద మతంగా ఉండిపోతోంది.సరే చరిత్ర వదిలేసి, ప్రస్తుతంలోకి వస్తే, ఇప్పుడు హిందుమతం ఆస్ట్రేలియా వాసులకి బహుప్రియం.మన దేశాన్ని తలపించేలా అక్కడ శ్రీకృష్ణ భగవానుడికి రథయాత్రలు జరుగుతున్నాయి,పెద్ద పెద్ద టెంపుల్స్, భజనలు, కీర్తనలు .అబ్బో, అక్కడ క్రైస్తవ మతం తరువాత హిందు మతమే పాపులర్, ఇంకా చెప్పాలంటే, హోలీ పండగ సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి, మరి ఇక్కడ ఎందుకు హిందుమతం అంత ప్రజాదరణ పొందుతోంది ? కారణం ఏంటి ?

దీనికి ముఖ్య కారణం ISKCON (International Society for Krishna Consciousness).మరీ ఇస్కాన్ అంటే ఏంటో ఇక్కడ అందరికి తెలిసిందే కదా.అవును, ఈ కృష్ణ భక్తుల సంఘం వలన హిందుమతం ప్రపంచ నలుమూలలకు వెళ్ళిపోయింది.కృష్ణలీలలు, భగవద్గీత పారాయణంలో తేలిపోతోంది ఆస్ట్రేలియా.

ఈమధ్య జరిగిన ఒక రథయాత్రలో ఏకంగా పాతికవేలమంది పాల్గొన్నారంటే నమ్మండి.ఈ కృష్ణ భక్తుల సంఘంలో వేలమంది ఆస్ట్రేలియన్లు చేరి కృష్ణభక్తులుగా మారుతున్నారు.

ఆస్ట్రేలియాలో 50కి పైగా హిందు దేవాలయాలు ఉన్నాయంట.గత రెండుమూడు దశాబ్దాలలో ఇక్కడ నివసిస్తున్న భారతీయుల సంఖ్య కూడా పెరగటంతో దేవాలయాలు పెరుగుతున్నాయి.

ముఖ్యంగా విక్టోరియా అనే ప్రాంతంలో మనవారి జనాభా ఎక్కువ అంట.కేవలం ఈ ప్రాంతంలోనే 19 హిందు దేవాలయాలు ఉన్నాయట.మరికొన్ని దేవాలయాల నిర్మాణం జరిగే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.ఇక కృష్ణుని టెంపుల్స్ అయితే చాలా ఎక్కువ.ఆస్ట్రేలియా రాజకీయనాయకులు కూడా భగవద్గీత చదువుతున్నారు.క్రీడాకారులు కూడా కృష్ణ లీలలు తెలుసుకుంటున్నారు.

యోగా కూడా ఈ పాపులారిటికి కారణం.మొత్తం మీదా, ఆస్ట్రేలియాలో హిందుమతం జెండా ఇలా ఎగురుతోంది.

మనం గర్వించాల్సిన విషయమే కదా ఇది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube